Tspsc బోర్డ్ సభ్యలందరు రాజీనామా చేయాలని పెన్ డ్రైవ్ లో ఎక్కించెంత వరకు ఏం చేసారు? అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండి పడ్డారు. విద్యార్థుల కళ్ళలో కేసిఆర్ మట్టి కొట్టారని సంచలన వ్యాఖ్యాలు చేశారు.
74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవం రోజున రాజ్యాంగానికి భిన్నంగా సిఎం కెసిఆర్ పరిపాలన చేయడం బాధాకరమన్నారు.
తమిళ్ సై తెలంగాణ వదిలి వెళ్లిపోవాలని, మోడీ తెలంగాణకు రావద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రధానికి తెలంగాణ పట్ల అనుకోని ప్రేమ వచ్చిందని ఎద్దేవ చేశారు.
తెలంగాణలో రాజకీయాలు ప్రజలను రక్షించేలా లేవని.. బీజేపీ, ఎంఐఎం, టీఆర్ఎస్ ప్రజలను ఎలా బతికించాలనేదే లేదని విమర్శించారు కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ప్రజలను రెచ్చగొట్టే కుట్ర జరుగుతుందని అన్నారు. తెలంగాణలో శాంతి భద్రతలను కాపాడుకోవడం ఎలా అనేది లేకుండా పోయిందని విమర్శించారు. కేసీఆర్ మోదీని, మోదీ కేసీఆర్ ని తిట్టుకున్నట్లు నటించారని ఆరోపించారు. ఏపీలో బీజేపీ కులాలకు ప్రయారిటీ ఇస్తోందని.. తెలంగాణలో మతపరమైన అంశాలను రెచ్చగొట్టే…
గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ రాజ్ భవన్ లో నిర్వహించిన ‘ మహిళా దర్బార్’ పై పొలిటికల్ దుమారం రేగుతోంది. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళా సమస్యలను చర్చించేందుకు గవర్నర్ ఏర్పాటు చేసిన మహిళా దర్భార్ కు విశేష స్పందన వచ్చింది. మెయిల్, ఫోన్ ద్వారా రాజ్ భవన్ కి కాంటాక్ట్ అయిన 300 మంది మహిళలు తమ సమస్యలు చెప్పుకునేందుకు రాజ్ భవన్ కి వచ్చారు. ఇదిలా ఉంటే గవర్నర్ మహిళా దర్బార్…