జగన్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తిరుపతిలో ఎన్టీవీతో మాట్లాడుతూ.. జగన్ పదే పదే ఢిల్లీకి ఎందుకు పరుగులు పెడుతున్నారో అసలు విషయం బట్టబయలైందన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసు తీర్పు సుప్రీంకోర్టులో చివరి దశకు రావడంతో భయంతో జగన్ ఢిల్లీకి వెళ్ళాడని ఆయన ఆరోపించారు. అమిత్ షాతో జగన్ రాజకీయ ఒప్పందం కుదుర్చుకున్నాడని, కేసు నుంచి తప్పించడానికి కర్ణాటక ఎన్నికల్లో 100సీట్లు గెలిపించాలని అమిత్ షాతో ఒప్పందం కుదిరిందన్నారు.
Also Read : Geetha Arts: బెస్ట్ ‘డ్యాన్సర్’ అల్లు అర్జున్ కాదు హృతిక్ రోషన్..?
జగన్ సంపాదించిన అక్రమ ఆస్తులు మొత్తాన్ని కర్ణాటక ఎన్నికల్లో ఖర్చు చేయబోతున్నాడని, బీజేపీతో చేసుకున్న ఒప్పందంతో వివేకానందరెడ్డి హత్య కేసు తీర్పు ఆలస్యం కాబోతుందన్నారు. వైసీపీని ఓడించాలంటే మా ఒక్కరి వల్లే కాదని, టీడీపీ, పవన్ కల్యాణ్, సీపీఐ, సీపీఎం కలసి ఒకే వేదికపైకి వస్తే ప్రజల్లో ఒక విశ్వాసం వస్తుందన్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికలలో లెఫ్ట్ పార్టీ టీడీపీ మధ్య మంచి ఫలితాలు వచ్చాయని ఆయన అన్నారు. ఇప్పటి వరకు చర్చలు జరగలేదని, పోత్తుల కలయికు టీడీపీ పెద్దన్న పాత్ర పోషించాలన్నారు. ఇలా ఉంటే బాగుంటుందని
నాఅభిప్రాయం చెప్పానని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ, పవన్ కళ్యాణ్ ఇక ముందుకు రావాలని, వాళ్ళుతో పోత్తుకు మేము రెడీ అని ఆయన క్లారిటీ ఇచ్చారు.
Also Read : 26/11 Mumbai Attack: ముంబై దాడి సూత్రధారులు “భారీ మూల్యం” చెల్లించాల్సిందే.. ఇజ్రాయిల్ వార్నింగ్..