kidney Racket Case: కిడ్నీ రాకెట్ కేసులో మొత్తం 15 మంది నిందితులు వీరే..
- ఏడుగురు అరెస్ట్
- పరారీలో ఎనిమిది మంది
- కీలక విషయాలు వెల్లడించిన సీపి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కిడ్నీ రాకెట్ కేసులో మొత్తం 15 మంది నిందితులు ఉన్నారు. ఏడుగురు అరెస్ట్ ఎనిమిది మంది పరారీలో ఉన్నట్లు సీపి సుధీర్ బాబు తెలిపారు. శనివారం నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ.. “అరెస్ట్ అయినవారిలో జనరల్ సర్జన్ డాక్టర్ సిద్ధంశెట్టి అవినాష్, అలకనంద హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ గుంటుపల్లి సుమంత్ కర్ణాటకకు చెందిన మధ్యవర్తి ప్రదీప్‌లతో పాటు ఆస్పత్రి సిబ్బంది గోపి, రవి, రవీందర్, హరీష్, సాయిలును అరెస్ట్ చేశాం. కిడ్నీ మార్పిడి చేసే ప్రధాన సర్జన్ తమిళనాడుకు చెందిన డాక్టర్ రాజశేఖర్ పరారీలో ఉన్నాడు. జమ్మూకాశ్మీర్‌కు చెందిన మరో సర్జన్ డాక్టర్ సోహెబ్ కూడా పరారీలో ఉన్నాడు. ఆర్గనైజర్లు పవన్, పూర్ణ, లక్ష్మణ్‌ల జాడ కోసం వెతుకుతున్నాం. మీడి యేటర్లు సూరజ్ మిశ్రా, శంకర్లు కూడా తప్పించుకు తిరుగుతున్నారు.” అని సుధీర్ బాబు పేర్కొన్నారు.
READ MORE: Saif Ali Khan: సైఫ్ కేసులో కొత్త ట్విస్టు.. భార్యాభర్తల మాటల్లో తేడా!
Also Read
- 10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
- Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
- CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
- Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
“చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్ అవినాష్.. ఇండియాకి తిరిగి వచ్చి పూణేలో డిప్లమా ఇన్ సర్జరీ పూర్తి చేశాడు. 2022లో హైదరాబాదులోని మాదన్నపేట లో ఉన్న జనని హాస్పిటల్ ను డాక్టర్ అవినాష్ అతని స్నేహితులు లీజుకు తీసుకున్నారు. అయితే తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడు అవినాష్. ఈ క్రమంలో అతనికి వైజాగ్ కు చెందిన లక్ష్మణ్ పరిచయమయ్యాడు. ఇల్లీగల్ కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేయాలంటూ లక్ష్మణ్, డాక్టర్ అవినాష్‌కు సూచించాడు. ప్రతి కిడ్నీ మార్పిడి సర్జరీకి రెండున్నర లక్షల రూపాయలు ఇచ్చేలాగా ఒప్పందం కుదుర్చుకున్నారు. డోనర్లు, మెడికల్ అసిస్టెంట్లు, రిసెప్షనిస్టులను మొత్తం కూడా తానే చూసుకుంటానని అవినాష్ కు లక్ష్మణ్ చెప్పాడు. డాక్టర్ అవినాష్ ఆపరేషన్ థియేటర్ ఇవ్వడంతో పాటు ఆపరేషన్ తర్వాత పేషెంట్లను చూసుకోవాల్సి ఉంటుంది అని ఒప్పందం కుదిరింది. అలా ఏప్రిల్ 2023 నుంచి 2024 జూన్ వరకు అక్రమ కిడ్నీ మార్పిడి చేస్తూ వచ్చారు. ఈ ఆపరేషన్ అన్నిటిని కూడా వైజాగ్ కి చెందిన పవన్, పూర్ణ, అభిషేకాలు చూసుకునేవారు.” అని సీపి సుధీర్ బాబు వెల్లడించారు.
READ MORE: Terrorist Attack: ఆర్మీ క్యాంపును లక్ష్యంగా విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఉగ్రవాదులు
“కిడ్నీ మార్పిడిలు చేయడానికి తమిళనాడుకు చెందిన డాక్టర్ రాజశేఖర్ పెరుమాల్, జమ్ముకాశ్మీర్ కి చెందిన డాక్టర్ సోహెబ్ తోపాటు తమిళనాడుకు చెందిన ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్లు శంకర్, ప్రదీప్, కర్ణాటక చెందిన సూరజ్‌లను తీసుకొచ్చేవారు. కిడ్నీ మార్పిడి సర్జరీ కావాలనుకునే వారి దగ్గర నుంచి 55 నుండి 60 లక్షల రూపాయల వరకు వసూలు చేసేవారు. అందులో ఐదు లక్షలు కిడ్నీ డోనర్‌కు, రెండున్నర లక్షలు డాక్టర్ అవినాష్‌కు, పది లక్షల రూపాయలు కిడ్నీ మెయిన్ సర్జరీ చేసిన డాక్టర్లకి, ఆపరేటింగ్ థియేటర్ అసిస్టెంట్లకు 30,000 ఇచ్చేవారు. కానీ 2024లో జనని హాస్పిటల్‌ను డాక్టర్ అవినాష్ మూసివేశాడు. ఇదే సమయంలో అలకానంద హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సుమంత్‌ను డాక్టర్ అవినాష్ కలిశాడు. డాక్టర్ సుమంత్ కిర్జిస్థాన్‌లో మెడికల్ స్టడీస్ పూర్తి చేశాడు. ఇల్లీగల్ కిడ్నీ మార్పిడి చేయడానికి ఇద్దరు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పటివరకు అలకనంద ఆస్పత్రిలో ఒక్క డిసెంబర్ నెలలోనే సుమారు 20 కిడ్నీ మార్పిడి సర్జరీలు చేశారు.” అని సీపి సంచలన విషయాలు వెల్లడించారు. కిడ్నీ రాకెట్ కేసును ఇప్పటి వరకు తామే చూశామని.. ఇంకా సీఐడీకి బదిలీ చేయలేదని సీపి సుధీర్ బాబు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
ట్రెండింగ్
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!