కోవిడ్ టైంలో చాలా మంది గంజాయి, డ్రగ్స్ కి అలవాటు పడ్డారని తెలిపారు సీపీ సీవీ ఆనంద్. డ్రగ్స్ తీసుకుంటున్న వారిలో ఎక్కువగా అమ్మాయిలే ఉంటున్నారని, డ్రగ్స్ అలవాటు పడ్డ అమ్మాయిలకి కౌన్సిలింగ్ ఇచ్చి సాధారణ జీవితానికి అలవాటు పడేలా చేస్తున్నామన్నారు. యాంటీ నార్కోటిక్ బ్యూరోని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, స్టేట్ అండ్ హైదరాబాద్ ని డ్రగ్ ఫ్రీ గా మార్చడానికి నార్కోటిక్స్ బ్యూరో పని చేస్తుందన్నారు. కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే నార్కోటిక్స్ కంట్రోల్ కోసం స్పెషల్ బ్యూరోస్ ఉన్నాయని, మూడు రోజుల పాటు నార్కోటిక్ అవైర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నామని ఆయన తెలిపారు.
Also Read : Pawan Kalyan: ప్రజా సమస్యలను పట్టించుకోకపోతే ఎమ్మెల్యేలను నిలదీయండి..
‘యాంటీ డ్రగ్ వారియర్స్ గా అందరూ పని చేయాలి.. డ్రగ్ ఫ్రీ తెలంగాణ గా మారుద్దాం.. దుర్గం చెరువు దగ్గర డ్రగ్ అవైర్నెస్ లో భాగంగా మిషన్ పరివర్తన్ ప్రోగ్రాం.. దుర్గం చెరువు ఫ్లై ఓవర్ కింద అంబేద్కర్ యూనివర్సిటీ గోడపై డ్రగ్ అడిక్షన్ కు సంబంధించిన ఆర్ట్స్ వేసిన HCU, JNAFAU స్టూడెంట్స్ అభినందించారు సీపీ.. ఆర్ట్స్ వేసిన స్టూడెంట్స్ కి అప్రిషియేషన్ సర్టిఫికెట్స్ అండ్ రివార్డ్ అందజేశారు సీపీ ఆనంద్.
Also Read : Health Tips: రాత్రిపూట సరిగ్గా నిద్రపోవడంలేదా? మీరు ఈ తప్పులు చేస్తున్నారా?