MLC AnanthaBabu: ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. బెయిల్ రద్దు చేసిన కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC AnanthaBabu: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ అనంతబాబుకు గతంలో మంజూరైన బెయిల్‌ను తూర్పుగోదావరి జిల్లా కోర్టు రద్దు చేసింది. సాక్షులను బెదిరించిన ఆరోపణల నేపథ్యంలో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో విచారణ కొనసాగుతున్న సమయంలో సాక్షులను ప్రభావితం చేయడం, బెదిరించడం వంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో అనంతబాబు బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ అనంతరం కోర్టు బెయిల్‌ను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే సాక్షులను బెదిరించిన కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. తాజాగా బెయిల్ రద్దు కావడంతో ఆయనకు మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణకు సంబంధించిన సాక్షుల విచారణ షెడ్యూల్‌ను కూడా రాజమండ్రి జిల్లా కోర్టు వెల్లడించింది. 2022 మే నెలలో సంచలనం సృష్టించిన ఈ హత్య కేసులో నవంబర్ లోపు తుది తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేసు విచారణ వేగవంతం అవుతుండగా, తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Also Read
- CM Chandrababu: మహిళా బిల్లును అడ్డుకోవడం పెద్ద విద్రోహం..
- Dead Body Door Delivery Case: ఎమ్మెల్సీ అనంతబాబు భార్యకు షాక్.. పిటిషన్ కొట్టివేసిన కోర్టు..
- Governor Abdul Nazeer: నేడు ఆదికవి నన్నయ్య వర్సిటీ స్నాతకోత్సవం.. ముఖ్య అతిథిగా గవర్నర్
- Rabi Paddy Procurement: రైతులకు గుడ్‌న్యూస్.. రేపటి నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
తాజావార్తలు
-
MLC AnanthaBabu: ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. బెయిల్ రద్దు చేసిన కోర్టు
-
Rahul Ramakrishna : థియేటర్లు ఖాళీగా ఉండటానికి అసలు కారణం ఇదే..
-
Sonia Gandhi: ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ.. పర్యటన రద్దు చేసుకుని, హుటాహుటిన ఢిల్లీకి రాహుల్ పయనం!
-
Bhuvneshwar Kumar: నేను బౌలర్‌ను కాదు.. భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Vijay Government Trust Vote: బలపరీక్షలో నెగ్గిన విజయ్ సర్కార్..!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!