Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
- మెట్ గాలా 2026లో లారెన్ వాసెర్ ప్రత్యేక ఆకర్షణ
- టాంపాన్ వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకున్న ప్రమాదం
- రెండు కాళ్లు కోల్పోయినా జీవితంపై గెలిచిన మోడల్
- మహిళల ఆరోగ్య భద్రత కోసం లారెన్ పోరాటం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచవ్యాప్తంగా ఫ్యాషన్ ప్రియులు ఎంతగానో ఎదురుచూసే మెట్ గాలా 2026 వేడుకలు మే 4న న్యూయార్క్ నగరంలో అత్యంత వైభవంగా జరిగాయి. విభిన్నమైన ఆహార్యాలు, వింత ఆభరణాలతో సెలబ్రిటీలు రెడ్ కార్పెట్‌పై సందడి చేసినప్పటికీ, వారందరిలో ఒక మహిళ మాత్రం తన “బంగారు కాళ్లతో” అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె మరెవరో కాదు, ప్రముఖ మోడల్ లారెన్ వాసెర్. ప్రబల్ గురుంగ్ డిజైన్ చేసిన బంగారు రంగు సూట్ ధరించి, తన సిగ్నేచర్ గోల్డ్ ప్రొస్తెటిక్ కాళ్లతో మెరిసిన ఆమె, రెడ్ కార్పెట్‌పై “బంగారు కాళ్ల అమ్మాయి”గా గుర్తింపు పొంది సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు.
ప్రస్తుతం 38 ఏళ్ల వయసున్న లారెన్ వాసెర్ అంతర్జాతీయ మోడలింగ్ రంగంలో అత్యంత విజయవంతమైన మహిళగా కొనసాగుతున్నారు. వోగ్, గ్లామర్ వంటి మేటి మ్యాగజైన్ల కవర్ పేజీలపై మెరిసిన ఆమె, ఫోర్బ్స్ ’30 అండర్ 30′ జాబితాలోనూ చోటు దక్కించుకున్నారు. అయితే ఆమె జీవితం 2012లో ఒక చిన్న పొరపాటు వల్ల ఊహించని మలుపు తిరిగింది. పీరియడ్స్ సమయంలో టాంపాన్ (Tampon) ఉపయోగించిన ఆమెకు, అది ప్రాణాంతకమైన టాక్సిక్ షాక్ సిండ్రోమ్ (TSS) సోకడానికి కారణమైంది. తన పడకగదిలో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలించేసరికి మరణానికి కేవలం 10 నిమిషాల దూరంలో ఉన్నారు. అవయవాలు విఫలమవడంతో ఆమెను కోమాలోకి పంపాల్సి వచ్చింది, అంతేకాక ఆమె బతికే అవకాశం కేవలం ఒక శాతం మాత్రమే ఉందని వైద్యులు అప్పట్లో స్పష్టం చేశారు.
Also Read
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
- India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
- India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
TSS ఇన్ఫెక్షన్ కారణంగా ఆమె కాళ్లు నల్లగా మారిపోవడంతో, ప్రాణాలను కాపాడటానికి వైద్యులు తొలుత ఆమె కుడి కాలును, ఆ తర్వాత 2018లో ఎడమ కాలును తొలగించాల్సి వచ్చింది. ఆ సమయంలో తీవ్రమైన నిరాశకు లోనైనప్పటికీ, తన తమ్ముడి కోసం బతకాలన్న సంకల్పంతో ఆమె తిరిగి పుంజుకున్నారు. ఈ చేదు అనుభవం తర్వాత లారెన్ కేవలం మోడల్‌గానే మిగిలిపోకుండా, మహిళల ఆరోగ్య భద్రత కోసం గళం ఎత్తుతున్నారు. పీరియడ్ ఉత్పత్తులలో ఉపయోగించే రసాయనాలు , సింథటిక్ ఫైబర్ల వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలపై పరిశోధన చేయాలని కోరుతూ అమెరికాలో ‘రాబిన్ డేనియల్సన్ చట్టం’ కోసం ఆమె చురుగ్గా పోరాడుతున్నారు. టాంపాన్లను 4 నుండి 8 గంటల కంటే ఎక్కువ సమయం ఉపయోగించడం వల్ల ఈ ప్రమాదం పొంచి ఉంటుందని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆమె తన కథనం ద్వారా హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
-
Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
-
Rajamouli: “నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు”.. ‘వారణాసి’పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!