Bhuvneshwar Kumar: నేను బౌలర్‌ను కాదు.. భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- ఐపీఎల్ 2026లో అదరగొడుతున్న భువనేశ్వర్ కుమార్
- అంతర్జాతీయ క్రికెట్ పునరాగమనంపై భువీ ఆసక్తికర వ్యాఖ్యలు
- అదే నా కెరీర్‌కు హెల్ప్ అయి ఉండవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhuvneshwar Kumar React on His Bowling: ఐపీఎల్ 2026లో అదరగొడుతున్న భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తన అంతర్జాతీయ క్రికెట్ పునరాగమనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాలోకి మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలనే ఆలోచన ప్రస్తుతం తనకు లేదని స్పష్టం చేశాడు. చాలా కాలంగా దీర్ఘకాలిక లక్ష్యాలు పెట్టుకోవడం మానేశానని చెప్పాడు. ముందుగానే వేసిన ప్లాన్లు ఎక్కువగా పని చేయలేదని, అందుకే ప్రస్తుతంపై మాత్రమే దృష్టి పెడుతున్నా అని భువీ చెప్పుకొచ్చాడు. తనకు సహజంగానే బంతిని స్వింగ్ చేసే నైపుణ్యం ఉందని, అది దేవుడిచ్చిన వరం అని పేర్కొన్నాడు. తాను ఎప్పుడూ ఎక్స్‌ప్రెస్ బౌలర్‌ను కాదని భువనేశ్వర్ తెలిపాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన భువనేశ్వర్ కుమార్.. ‘నేను ఇప్పుడు భారత జట్టులోకి తిరిగి రావాలని ఆలోచించడం లేదు. చాలా ఏళ్ల క్రితమే లాంగ్‌టర్మ్ గోల్స్ పెట్టుకోవడం మానేశాను. ఎందుకంటే నేను అలా ప్లాన్ చేసిన ప్రతిసారి అనుకున్నట్లు జరగలేదు’ అని తెలిపాడు. ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్లో తన ప్రదర్శనలపై కూడా భువీ సంతృప్తి వ్యక్తం చేశాడు. ‘200 మ్యాచ్‌లు ఆడటం, పవర్‌ప్లేలో అండ్ డెత్ ఓవర్లలో ఇన్ని వికెట్లు తీయడం నాకు సంతోషంగా ఉంది. ఇవన్నీ నేను ఎన్నో ఏళ్లుగా చేసిన కష్టానికి వచ్చిన ఫలితాలే’ అని చెప్పాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
తన కెరీర్లో మంచి, చెడు దశలు రెండూ ఎదురయ్యాయని భువనేశ్వర్ కుమార్ చెప్పాడు. ‘ప్రతి క్రికెటర్ జీవితంలో లాగే నా కెరీర్లో ఒడిదుడుకులు ఉన్నాయి. కానీ ప్రస్తుతం నేను ఏదైనా ప్రత్యేకమైన భావోద్వేగంతో లేను. ప్రశాంతంగా నా ఆటను ఆస్వాదిస్తున్నాను. సహజంగానే బంతిని స్వింగ్ చేసే నైపుణ్యం నాకు ఉంది. అది దేవుడిచ్చిన వరం అని భావిస్తున్నా. నేను ఎప్పుడూ ఎక్స్‌ప్రెస్ (ఫాస్ట్ బౌలర్) బౌలర్‌ను కాదు. వేగంగా బౌలింగ్ చేయను కాబట్టి త్వరగా అలసిపోను. బహుశా అదే నా కెరీర్‌కు హెల్ప్ అయి ఉండవచ్చు. పవర్‌ప్లేలో బంతి స్వింగ్ అయితే వికెట్ల కోసం చూస్తా. డెత్ ఓవర్లలో ఆత్మవిశ్వాసంతో బౌలింగ్ చేస్తా’ అని భువనేశ్వర్ తెలిపాడు.
అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోవడం వల్ల ఐపీఎల్ తర్వాత తగినంత విశ్రాంతి దొరుకుతోందని స్వింగ్ కింగ్ భువీ పేర్కొన్నాడు. స్వింగ్ బౌలింగ్‌తో ఎన్నో సంవత్సరాలుగా భారత జట్టుకు కీలక బౌలర్‌గా సేవలందించిన భువనేశ్వర్ కుమార్.. తన క్రమశిక్షణ, లైన్ అండ్ లెంగ్త్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. గాయాలు, ఫామ్ సమస్యలు అతడి కెరీర్‌ను ప్రభావితం చేసినప్పటికీ.. భారత క్రికెట్లో అత్యుత్తమ స్వింగ్ బౌలర్లలో ఒకరిగా భువీ పేరు నిలిచిపోతుంది.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?