తనపై నమోదైన కేసుల్లో ముందస్తు మంజూరు చేయాలంటూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు
తీర్పును రిజర్వ్ చేసింది. రేపు తీర్పు ఇవ్వనున్నట్లు కోర్టు తెలిపింది. ఏపీ హైకోర్టు EVM ధ్వంసం ఘటనలో పిన్నెల్లికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో పల్నాడు పోలీసులు పిన్నెల్లి పై మరో మూడు కేసులు నమోదు చేశారు. ఈ మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిన్నెల్లి అత్యవసర పిటిషన్లు దాఖలు చేశారు. పిన్నెల్లి తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. అరెస్టు చేయాలనే ఉద్దేశంతోనే వరుస FIR లు నమోదు చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. జూన్ 6 వరకు అరెస్ట్ చేయకుండా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు పోలీసులు అమలు చేయడం లేదన్నారు.
READ MORE: Pakisthan: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 13 మంది మృతి
కాగా.. ఈవీఎంల ధ్వంసం కేసులో పిన్నెల్లికి బెయిల్ మంజూరు చేసిన కోర్టు ఓ షరతు విధించింది. ఈవీఎం ధ్వంసం కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కౌంటింగ్ రోజున మాచర్ల వెళ్లొద్దని వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు తెలిపింది. ఈవీఎం (EVM) ధ్వంసం చేసిన ఘటనలో పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు ఈ ఆదేశాలు వెలువరించింది. పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంలోనే వచ్చే నెల 6 వరకు ఉండాలంది. కౌంటింగ్ కేంద్రానికి వెళ్లేందుకు మాత్రమే అనుమతి ఇచ్చిన హైకోర్టు.. ఈ కేసు విషయంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడవద్దని పిన్నెల్లి కి సూచించింది. సాక్షులతో మాట్లాడే ప్రయత్నం చేయవద్దని వెల్లడించింది. పిన్నెల్లి పై పూర్తి స్థాయి నిఘా విధించాలని సీఈఓ, పోలీసు అధికారులుకు హై కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.