Hyderabad: ఘట్కేసర్లో విషాదం.. రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి విషాద ఘటన చోటుచేసుకుంది. దంపతులు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడటంతో అటు వారి సొంత గ్రామంలోనూ, ఇటు వారు నివసిస్తున్న ప్రాంతంలోనూ తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపాయిపేట గ్రామానికి చెందిన రవికుమార్, శిరీష దంపతులు ఘట్కేసర్–బీబీనగర్ రైల్వే మార్గంలోని ఎన్ఎఫ్సీ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ దంపతులు ప్రస్తుతం పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూరులో నివాసముంటున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న సికింద్రాబాద్ రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం, లభ్యమైన ఆధారాల ప్రకారం, ఈ ఘోర ఘటన ఆత్మహత్యగా బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, దీనిపై పోలీసుల నుంచి ఇంకా అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది. ఈ దంపతులు ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అనే కోణంలో సికింద్రాబాద్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం తెలియనున్నాయి.
Also Read
- EPFO కొత్త రూల్ .. PF డిపాజిట్‌పై కీలక మార్పు.. ఎవరికి లాభం?
- Jupally Krishna Rao: "లెక్క తప్పు ఐతే రాజీనామా చేస్తా".. కేసీఆర్, కేటీఆర్‌లకు మంత్రి జూపల్లి సవాల్!
- Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. సీసీటీవీ హార్డ్‌డిస్క్‌లు మార్చారా..?
- Shreyas Iyer: కోహ్లీ రికార్డు బ్రేక్.. మ్యాచ్ రద్దయినా చరిత్ర సృష్టించిన శ్రేయస్.. తొలి భారతీయ కెప్టెన్‌గా రికార్డ్..
తాజావార్తలు
-
Hyderabad: ఘట్కేసర్లో విషాదం.. రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య!
-
EPFO కొత్త రూల్ .. PF డిపాజిట్‌పై కీలక మార్పు.. ఎవరికి లాభం?
-
Jupally Krishna Rao: “లెక్క తప్పు ఐతే రాజీనామా చేస్తా”.. కేసీఆర్, కేటీఆర్‌లకు మంత్రి జూపల్లి సవాల్!
-
Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. సీసీటీవీ హార్డ్‌డిస్క్‌లు మార్చారా..?
-
Akhil Akkineni : సమంత ‘మా ఇంటి బంగారం’పై అఖిల్ షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్‌ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్‌ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్‌లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!