మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ కానిస్టేబుల్ ఎస్సైని కాల్చి చంపిన ఉదంతం వెలుగు చూసింది. అధికారితో చిన్న వివాదం కారణంగా వాగ్వాదానికి దిగిన కానిస్టేబుల్ ఆవేశంతో తన సర్వీస్ రైఫిల్‌తో పాయింట్ బ్లాక్ రేంజ్‌లో ఎస్సైను కాల్చి చంపాడు. దీంతో కుర్చీలో కూర్చున్న ఎస్సై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కాల్పులు జరిపిన కానిస్టేబుల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.