హిమాచల్ ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. హిమాచల్‌లో 68 సీట్లలో 40 గెలిచిన కాంగ్రెస్ సీఎం అభ్యర్థిపై కసరత్తు చేస్తోంది. శాసనసభ పక్షనేత ఎన్నిక అధికారాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు అప్పగిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకవాక్య తీర్మానం చేశారు.
హిమాచల్ ప్రదేశ్‌లో 68 అసెంబ్లీ స్థానాలకు గాను 40 స్థానాలను గెలుచుకోవడం ద్వారా కాంగ్రెస్ బీజేపీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటికీ, పార్టీ అభ్యర్థులు 15 స్థానాల్లో 2,000 కంటే తక్కువ మెజారిటీతోనే విజయం సాధించడం గమనార్హం.