Congress plenary : దేశంలో ద్వేషపూరిత నేరాల ముప్పును పరిష్కరించడానికి, చట్టాన్ని ప్రతిపాదిస్తామని కాంగ్రెస్ తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశం జరుగుతోంది. కాంగ్రెస్ సభ్యులు, కొన్ని షరతులతో కూడిన ప్రతిపాదిత చట్టం 2024 సార్వత్రిక ఎన్నికల కోసం పార్టీ మ్యానిఫెస్టోలో చేర్చనుంది కాంగ్రెస్. రాజకీయ తీర్మానంలో మొత్తం 56 అంశాలు ఉంటాయని పార్టీ సీనియర్ సభ్యుడు ఒకరు తెలిపారు.
కాంగ్రెస్ రాజకీయ తీర్మానంలో వస్తు, సేవల సరఫరాలో మతం, కులం, లింగం, భాష ఆధారంగా వివక్షను నిషేధించే లక్ష్యంతో వివక్ష నిరోధక చట్టాన్ని కూడా ప్రతిపాదిస్తామని ఆ పార్టీ సీనియర్ నాయకులు పేర్కొన్నారు. రాజకీయ తీర్మానం పొత్తుపై పార్టీ వైఖరి కూడా త్వరలోనే చక్కబడుతుందని, భావసారూప్యత గల పార్టీలతో కాంగ్రెస్ పొత్తులు ఉంటాయని మరో పార్టీ సభ్యుడు తెలిపారు.
Read Also: Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లో తుపాకుల మోత.. ముగ్గురు జవాన్లు మృతి
ప్రత్యక్ష, పరోక్ష చర్యల ద్వారా న్యాయవ్యవస్థ నిరంతరం బెదిరింపులకు గురవుతుందన్నారు. ఇది వారి మనస్సులో భయాందోళనలను సృష్టిస్తుందని అభిప్రాయపడ్డారు. దురదృష్టవశాత్తు, న్యాయవ్యవస్థపై దాడికి స్వయంగా న్యాయమంత్రి నాయకత్వం వహిస్తున్నారని ఆరోపించారు. పాలకవర్గం న్యాయవ్యవస్థపై తీసుకు వస్తున్న ఒత్తిడిని కూడా చర్చిస్తామన్నారు.
Read Also: Peanuts: గుప్పెడు శనగలు తినండి.. గుండెను భద్రంగా పెట్టుకోండి
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో 85వ కాంగ్రెస్ ప్లీనరీ సమావేశం శుక్రవారం రాయ్‌పూర్‌లో ప్రారంభమైంది. దాదాపు 15,000 మంది కాంగ్రెస్ ప్రతినిధులు ‘హాత్ సే హాత్ జోడో’ ప్లీనరీ సమావేశానికి హాజరవుతున్నారు. సమావేశానికి హాజరయ్యేందుకు మూడు రోజుల పాటు మేధోమథనం చేస్తున్నారు. ఇది కొత్త కార్యవర్గానికి మార్గం సుగమం చేస్తుంది. కాంగ్రెస్ 2024 జాతీయ ఎన్నికల ప్రచారానికి ప్రణాళిక రెడీ చేస్తుంది.