Congress Party: తెలంగాణ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీలో జోష్ వచ్చింది.. అది ఆంధ్రప్రదేశ్‌లోనూ పనిచేస్తుందనే నమ్మకంతో ఆ పార్టీ నేతలు ఉన్నారు.. కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో తెలంగాణపై ప్రభావం చూపినట్టే.. తెలంగాణలో విజయం కూడా ఏపీపై పనిచేస్తుంది అంటున్నారు.. ఇక, కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ భేటీలో వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతల మధ్య చర్చ సాగింది.. ఘర్ వాపసీ పిలుపివ్వాలని భావిస్తు్న్నారు ఏపీ కాంగ్రెస్ నేతలు.. వైసీపీలో బలమున్న ద్వితీయ శ్రేణి నేతలతో టచ్ లోకి వెళ్లాలని చర్చించారు. చేరికల కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.
Read Also: Kalki 2898 AD : కల్కిలో ప్రభాస్ మూడు పాత్రలు ఇవేనా ..?
ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రాతినిధ్యం ఉండేలా చూసుకోవాలని అభిప్రాయపడ్డారట నేతలు.. వీలైనంత మేర ఓట్ల శాతం పెంచుకునేలా కసరత్తు చేయనున్నారు ఏపీ కాంగ్రెస్ నేతలు.. సోషల్ మీడియా క్యాంపెయిన్ కోసం సునీల్ కనుగోలు సేవలు తీసుకునేలా ఏఐసీసీని కోరనున్నారట.. ఆంధ్రప్రదేశ్‌లో ‘జగన్ పోవాలి.. హస్తం రావాలి’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లనున్నారు ఏపీ కాంగ్రెస్ నేతలు.. ఇక, రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి అమరావతి, విశాఖపట్నంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాధీలతో భారీ బహిరంగ సభలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట.. మొత్తం ఆరు బహిరంగ సభలకు పార్టీ అగ్ర నేతలను రప్పించాలనే భావనలో ఏపీ కాంగ్రెస్ పార్టీ ఉందని తెలుస్తోంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో పూర్తిగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీని తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు నేతలు.