పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ యాక్షన్ కథతో రూపొందుతున్న సినిమా’ కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతుంది.. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ జనాలను ఎంతగా ఆకట్టుకున్నాయో చూశాం.. ఈ సినిమా ఒక సైన్స్ ప్రిక్షన్ డ్రామా.. చరిత్రలో ఎన్నడో జరిగిన ఘటన అని సోషల్ మీడియాలో కూడా వార్తలు వినిపిస్తున్నాయి..
ఈ చిత్రంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తున్నారు.. దీపికా పదుకొనే, దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు. కాగా ఈ మూవీలో ప్రభాస్ మోడరన్ విష్ణుమూర్తిగా కనిపించబోతున్నారని నిర్మాత అశ్వినీ దత్ వెల్లడించిన సంగతి తెలిసిందే.. ఇక ఈ సినిమాలో ప్రభాస్ మొత్తం మూడు పాత్రల్లో కనిపించునున్నారని ఇప్పటివరకు విడుదలైన టీజర్ లో మనం చూసాము..
ఆ మూడు పాత్రలు పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ మూడు టైం పీరియడ్స్ లో డిఫరెంట్ గెటప్స్ లో ప్రభాస్ కనిపించబోతున్నారట. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు గాని, ప్రస్తుతం ఈ వార్త అయితే వైరల్ గా మారింది. వైజయంతి బ్యానర్స్ పై అశ్వినీ దత్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2024 సంక్రాంతికి రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ అనౌన్స్ చేసినప్పటికి, ఇప్పటికి ఈ సినిమా పూర్తి కాలేదని తెలుస్తుంది..గ్రాఫిక్స్ వర్క్స్ పూర్తి కాకా రిలీజ్ ని వాయిదా వేశారు. మరి ఈ చిత్రాన్ని ఎప్పుడు పూర్తి చేసి ఎప్పుడు ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తారో చూడాలి. కాగా ఈ సినిమా ఒకటి కంటే ఎక్కువ భాగాలుగా తెరకెక్కుతోందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.. ఈ సినిమా ఎన్ని పార్ట్ లుగా వస్తుందో చూడాలి.. ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందిస్తున్నారు..