అధికారం పోగానే పార్టీని వదిలేయడం, తిరిగి పవర్ రాగానే ఘర్ వాపసీ అనడం సమకాలీన రాజకీయాల్లో సహజమైపోయింది. అంతా మా ఇష్టం అన్నట్టుగా జంపింగ్ జపాంగ్‌లు గెంతులేస్తుంటే... అటు రాజకీయ పార్టీలు కూడా రకరకాల కారణాలు, అవసరాలతో ఇలాంటి బ్యాచ్‌ని ప్రోత్సహిస్తూనే ఉన్నాయి. దీంతో ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీలోకి చేరడం చాలామందికి పరిపాటిగా మారింది.