ప్రజా ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేయాలని పథకం ప్రకారం బీఆర్ఎస్ కుట్రలు చేస్తుందని ఆరోపించారు. కొడంగల్లో భూసేకరణ పై వికారాబాద్ కలెక్టర్ గ్రామస్తులతో సమావేశం అయ్యేందుకు వెళ్లారు.. బీఆర్ఎస్ నేతల ఆదేశాలతో రైతుల ముసుగులో కలెక్టర్ పై దాడి చేశారని అన్నారు. దాడికి సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయి.. ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత రాకపోవడంతో ఇలాంటి పనులు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని మల్లు రవి మండిపడ్డారు.