Podem Veeraya: రేగాకాంతారావుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే పోదెం వీరయ్య విరుచుకుపడ్డారు. తనని దసరా బుల్లోడు సంక్రాంతి గంగిరెద్దుగా అభివర్ణించడంతో పరుష పదజాలంతో ప్రశ్నించారు. రేగా కాంతారావు నువ్వు గెలిచింది ఎక్కడా.. కాంగ్రెస్ పార్టీలో గెలిచి డబ్బులకి అమ్ముడుపోయిన నువ్వా నన్ను విమర్శించేదంటూ మండిపడ్డారు. నీకు సిగ్గు లజ్జ ఉంటే ప్రజాక్షేత్రంలో పోరాడాలని అన్నారు. భద్రాచలానికి నువ్వు కానీ, నీ ముఖ్యమంత్రి గాని, నీ పార్టీ గాని ఏం చేశారని ప్రశ్నించారు. ఐదు పంచాయతీల విషయంలో ఏం పోరాడారని దుయ్యబట్టారు.
IND vs PAK: భారత్ లక్ష్యం 192.. విజృంభించిన టీమిండియా బౌలర్లు
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ పై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక మంత్రివైనా నువ్వు కేవలం నీ నియోజకవర్గానికి మాత్రమే నిధులు తెచ్చుకుని అభివృద్ధి చేసుకుంటున్నారని వీరయ్య ఆరోపించారు. భద్రాచలం గాలికి వదిలేసిన మీరు ఏ మొహం పెట్టుకొని భద్రాచలం వస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా తెల్లం వెంకటరమణ ప్రశ్నిస్తూ.. గత ఎన్నికల్లో ఓడిపోయిన మీరు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఒక్కసారైనా ముఖ్యమంత్రిని కలిసి నిధులు ఏమైనా అడిగారా అని ప్రశ్నించారు.
PM Modi: నవరాత్రి వేళ ప్రధాని రాసిన “గర్భా” సాంగ్.. యూట్యూబ్‌లో రికార్డ్ క్రియేట్ చేస్తున్న వీడియో..
రేగా కాంతారావు ఏమాత్రం సిగ్గు లేకుండా కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారని పోదెం వీరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ గెలిచేది కాంగ్రెస్ పార్టీనేనని.. రేపు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందన్నారు. అప్పుడు నీ అక్రమ సంపాదన, భూదందాల సంగతి చూస్తామని తెలిపారు. తాను పుట్టింది కాంగ్రెస్ పార్టీలోనని, చచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీలోనే.. రోజుకొక పార్టీ కండువా మార్చే మీరా నన్ను విమర్శించేది అని దుయ్యబట్టారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం అధికార పార్టీ ప్రలోభాలకు లొంగకుండా నాయకుడుగా నిలబడింది తాను మాత్రమేనని పోదెం వీరయ్య అన్నారు. కేసీఆర్ డబ్బులకి కక్కుర్తి పడి పార్టీ మారింది రేగా కాంతారావు, రోజుకు ఒక పార్టీ మారే వ్యక్తి తెల్ల వెంకట్రావు.. వీరు నన్ను ఓడిస్తారా వాళ్లకి డబ్బుంటే నాకు ప్రజాబలం ఉందని పోదెం వీరయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!