Gunturu Kaaram : గుంటూరు కారం నుంచి ‘అమ్మ’ ఎమోషనల్ సాంగ్ రిలీజ్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘గుంటూరు కారం’.అతడు, ఖలేజా సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా కావడంతో అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మొదటి రోజే ఈ సినిమాకు కొంచెం మిక్స్‌డ్ టాక్ రావడం తో కలెక్షన్ల మీద ప్రభావం పడుతుందని ట్రేడ్ వర్గాలు భావించాయి. కానీ ఆ అంచనాలను తలకిందులు చేస్తూ ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాలోని సాంగ్స్ చార్ట్ బస్టర్ గా నిలిచాయి..
ఇప్పటికే ఈ సినిమా నుంచి ధమ్ మసాలా, కుర్చీ మడత పెట్టి మరియు ఓహ్ మై బేబీ, సాంగ్ లు విడుదల చేయగా.. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ‘అమ్మ’అనే ఎమోషనల్ సాంగ్‌ను విడుదల చేశారు. పసి వాడయై వేచి చూస్తుందా బదులే రాని గతం. పగ వాడయై నింద మోస్తుందా ఎదుటే ఉన్న నిజం అంటూ సాగిన ఈ పాట హృదయాలను హత్తుకునేలా ఉంది. ఇక ఈ పాటకు ‘సరస్వతీ పుత్ర’ రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. విశాల్ మిశ్రా ఆలపించారు..ఈ మూవీ కి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అదిరిపోయే మ్యూజిక్ అందించారు.ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీలీల మరియు మీనాక్షీ చౌదరీలు హీరోయిన్‌లు గా నటించారు.సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ మహేష్ తల్లి పాత్రలో నటించారు.. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై చినబాబు ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా నిర్మించాడు.థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ మూవీ త్వరలోనే ఈ మూవీకి ఓటీటీ లో రిలీజ్ కానుంది.
Also Read
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
- Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
- Success Story: యూపీఎస్సీ కోసం 16 ప్రభుత్వ ఉద్యోగాలను తిరస్కరించింది.. కట్ చేస్తే ఐపీఎస్..
- Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
తాజావార్తలు
-
Jadal Look: “మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా”.. ‘ది ప్యారడైజ్’ లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
-
Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
-
Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
-
Success Story: యూపీఎస్సీ కోసం 16 ప్రభుత్వ ఉద్యోగాలను తిరస్కరించింది.. కట్ చేస్తే ఐపీఎస్..
-
Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!