JP Nadda: కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్రపై, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ దేశాన్ని విచ్ఛిన్నం చేయగలదు.. కానీ ఏకం చేయదని ఆరోపించారు.దక్షిణ గుజరాత్‌లోని నవ్‌సారి పట్టణంలో బీజేపీ అభ్యర్థి రాకేష్ దేశాయ్ తరఫున ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు. నవ్‌సారి స్థానానికి డిసెంబరు 1న తొలి దశలో పోలింగ్ జరగనుంది.
‘‘కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర చేపట్టిందా లేదా భారత్ తోడో యాత్ర చేపట్టిందా అని ఆశ్చర్యపోతున్నా.. భారత్‌ను ఏకం చేయాలని వారి నేతలు చెబుతున్నారు. కానీ నిజజీవితంలో ఏం చేస్తారు? ఢిల్లీలోని జేఎన్‌యూకు తమ అధినేత రాహుల్ గాంధీ వెళ్లి అనుకూలంగా నినాదాలు చేసే వారికి మద్దతు తెలిపారు.’ అని నడ్డా అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్‌పై రాహుల్ చేసిన ప్రకటన కూడా ఖండించదగినదని ఆయన అన్నారు. బీజేపీ అభివృద్ధి కోసం పనిచేస్తోందని.. ఇతర పార్టీలు కమీషన్ కోసం పనిచేశాయని నడ్డా ఆరోపించారు.
Supreme Court: జనాభా నియంత్రణపై జోక్యం చేసుకోలేం..
కరోనావైరస్ మహమ్మారి సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ.. భారతదేశం కేవలం తొమ్మిది నెలల్లో రెండు వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేయగలిగిందని, మహమ్మారి నుంచి మొత్తం జనాభాను సురక్షితంగా ఉంచిందని నడ్డా అన్నారు. మోడీ నాయకత్వంలో దాదాపు 100 దేశాలకు వ్యాక్సిన్‌లను కూడా పంపగలిగామని.. అందులో 38 దేశాలకు ఉచితంగా పంపిణీ చేయగలిగామని తెలిపారు. గుజరాత్‌లో డిసెంబర్ 1, 5 తేదీల్లో ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.