Ponnam Prabhakar : బీసీ కులగణనపై ప్రజలందరూ సహకరించాలి
- హైదరాబాద్: బీసీ కులగణనపై ప్రజలకు మంత్రి పొన్నం లేఖ
- బీసీ కులగణనపై ప్రజలందరూ సహకరించాలి
- ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేపడుతున్నాం : మంత్రి పొన్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర కుల గణనపై రవాణా , బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ ప్రజలకు లేఖ రాశారు. 10 నవంబర్ 2023 రోజున రాహుల్ గాందీ మాట ప్రకారము కర్నాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య సమక్షంలో కామారెడ్డి బహిరంగ సభలో తెలంగాణ కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 4 ఫిబ్రవరి 2024 రోజున జరిగిన మంత్రి మండలి నిర్ణయము మేరకు మొత్తము తెలంగాణ రాష్ట్రములో ఇంటింటికి సమగ్ర సర్వే (సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాది, రాజకీయ , కులాల సర్వే (కుల గణన)) చేపట్టాలని ఈ కేబినెట్ తీర్మానించిందన్నారు పొన్నం ప్రభాకర్. రాష్టంలో వెనుకబడిన తరగతుల, ఎస్‌సి&ఎస్‌టి పౌరులు , రాష్ట్రంలోని ఇతర బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వివిధ సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాది రాజకీయ అవకాశాలను ప్లాన్ చేసి అమలు చేయడానికి గాను 16 ఫిబ్రవరి 2024 రోజున శాసన సభలో ఏకగ్రీవంగా తీర్మానించడమైనదని ఆయన తెలిపారు. ఇట్టి తీర్మానమునకు అనుగుణముగా జి.ఓ.ఏంయెస్. నెం. 26, 15.03.2024 ప్రకారము కుల గణన చేయుటకు గాను తెలంగాణ బీసీ కమిషన్ యొక్క తీర్మానము క్రమము బీసీ సంక్షేమ శాఖ ద్వారా 150 కోట్ల రూపాయలను విడుదల చేయడము ప్రక్రియ ప్రారంభము జరిగిందని పొన్నం ప్రభాకర్ తెలిపారు.
CSK- IPL 2025: రిటెన్షన్‌ను సీఎస్కే చాలా అద్భుతంగా వినియోగించుకుంది..
Also Read
- నేటి నుంచి FIFA World Cup షురూ.. ఆటలో కొత్త నియమాలు ఇవే.!
- Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
అంతేకాకుండా..’కులగణన చేయుటకు గాను జి.ఓ.ఏంయెస్. నెం. 199, 06.09.2024 రోజున శ్రీ నిరంజన్ ఛైర్మన్ గా , రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాల లక్ష్మి లను మెంబర్స్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయటము జరిగినది. తెలంగాణ రాష్ట్రములో ఇంటింటికి సమగ్ర సర్వే (సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాడి, రాజకీయ , కులాల సర్వే) కులగణన చేయుటకు గాను జి.ఓ.ఏంయెస్. నెం. 18, తేది. 10.10.2024 ద్వారా ప్లానింగ్ డిపార్ట్ మెంట్ ను నోడల్ డిపార్ట్ మెంట్ గా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వము ఉత్తర్వులు జారీచేయడమైనది. 6.11.2024 నుండి 85,000 మంది ఎన్యూమరేటర్లు ప్రతి 10 మంది ఏన్యూమరేటర్లకు ఒక పరిశీలకుడుగా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్టాఈ అధికారుల పర్యవేక్షణలో ప్రతి ఇంటికి సమగ్ర సమాచార సేకరణ చేసి డాటా ఎంట్రీ చేయడముతో పాటుగా 30 నవంబర్ లోపు ఈయొక్క సమాచార సేకరణ పూర్తి చేయాలని ప్రణాళికలతో ముందుకు సాగుతున్న ఈ కార్యక్రమమునకు ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాను. దేశములో తొలిసారిగా , రాష్ట్రములో రాహుల్ గాందీ గారి మాట ప్రకారము జరుగుతున్న ఈ సర్వేను ఈ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఈ సర్వే రాబోయే కాలములో అన్ని రకాల పథకాలు అందుటకు , ఇది ఒక మెగా హెల్త్ చెకప్ లాగా సమాచారముతో పాటుగా భవిష్యత్ ప్రక్రియ పూర్తి చేయడానికి ఉపయోగపడుతుంది కావునా తప్పకుండా ప్రతి ఒక్కరూ సమాచారము సేకరిస్తున్న వారు , సమాచారము తెలుపుతున్న ప్రతి తెలంగాణ బిడ్డ ఈ యొక్క సర్వే లో భాగస్వాములై సహరించాలని కోరుతున్నాను.’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖలో పేర్కొన్నారు.
Vikkatakavi : తెలుగు, తమిళ భాషల్లో ఓటీటీ లో రిలీజ్ కానున్న‘వికటకవి’
తాజావార్తలు
-
నేటి నుంచి FIFA World Cup షురూ.. ఆటలో కొత్త నియమాలు ఇవే.!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ మూడు రాశుల వారికి నేడు పండగే!
-
Tollywood : చేతులు దాటుతున్న సినిమా బడ్జెట్లు.. కుదేలవుతున్న టాలీవుడ్ నిర్మాతలు!
-
Strait of Hormuz Closure: ఇరాన్ తీవ్ర హెచ్చరిక.. హార్మూజ్ గుండా వచ్చే నౌకలపై దాడులకు సిద్ధం.. చమురు సరఫరాకు ముప్పు
-
Peddi : ‘పెద్ది’ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… డిలీటెడ్ సీన్లన్నీ ఇక్కడ చూడొచ్చు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!