Coaching Center Tragedy : రావు కోచింగ్ సెంటర్‌లోని బేస్‌మెంట్‌లో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటనలో ఇన్‌స్టిట్యూట్‌లోనే డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా మూసివేశారని తేలింది. ఇన్‌స్టిట్యూట్‌లో ఎలాంటి భద్రత ఏర్పాట్లు లేవనే వాస్తవాన్ని ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నివేదిక కూడా వెల్లడించింది. ఢిల్లీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ప్రకారం.. కోచింగ్ ఇన్స్టిట్యూట్ డ్రైనేజీ కాలువను పై నుండి కప్పింది. ఇన్స్టిట్యూట్ పార్కింగ్ స్థలం నేరుగా రహదారికి ఆనుకొని ఉంటుంది. దీంతో భారీ వర్షం వచ్చినప్పుడు, రహదారిపై వచ్చే నీరు డ్రైన్‌లోకి వెళ్లకుండా నేరుగా పార్కింగ్ స్థలంలోకి వెళ్తున్నాయి. సెక్యూరిటీ సిబ్బంది కూడా లేరు. సిబ్బంది ఉంటే నీరు వదిలించే విషయంలో అప్రమత్తంగా ఉండి విద్యార్థుల ప్రాణాలు కాపాడే అవకాశం ఉండేది. భవనం వెలుపల ఉన్న రహదారిపై ఆక్రమణలు, అక్రమ ర్యాంప్ కారణంగా వర్షపు నీరు కాలువలలోకి వెళ్లలేకపోయిందని నివేదిక ఎంసీడీ పై ప్రశ్నలను లేవనెత్తింది.
లైబ్రరీల ఫీజులు రెట్టింపు
పాత రాజేంద్ర నగర్, పరిసర ప్రాంతాల్లోని లైబ్రరీలు ఇప్పుడు ఫీజులను రెట్టింపు చేశాయని సివిల్ సర్వీసెస్‌కు సిద్ధమవుతున్న విద్యార్థులు పేర్కొన్నారు. ఇంతకుముందు రూ.2000 ఫీజు ఉన్న చోట ఇప్పుడు నెలకు రూ.4 నుంచి 5 వేలు అడుగుతున్నారు.
Read Also:Niharika: నిహారిక సినిమాకు అదిరే ఆఫర్.. థియేట్రికల్ రైట్స్ డీల్ క్లోజ్..
ఢిల్లీ ప్రభుత్వం, కార్పొరేషన్ కమిషనర్‌కు NHRC నోటీసు
రావు కోచింగ్ సెంటర్‌లోని బేస్‌మెంట్‌లో నీరు చేరి ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ఢిల్లీ ప్రభుత్వం, పోలీసులు, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు నోటీసు జారీ చేసింది. ఈ విషయాన్ని సుమోటోగా గుర్తించి, రెండు వారాల్లోగా ఒక వివరణాత్మక నివేదికను సమర్పించాలని కమిషన్ వారిని కోరింది. ఇందులో సంస్థలపై పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులు, సంబంధిత శాఖలు తీసుకున్న చర్యల వివరాలు కూడా ఉంటాయి.
ఈరోజు హైకోర్టులో విచారణ
ఈ కేసులో అత్యున్నత స్థాయి దర్యాప్తునకు డిమాండ్ చేస్తూ దాఖలైన పిల్‌ను బుధవారం ఢిల్లీ హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్, జస్టిస్ తుషారరావు ధర్మాసనం విచారించనుంది. కుటుంబ్ అనే సంస్థ ఈ పిల్ దాఖలు చేసింది. ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్, ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీలను పిటిషన్‌లో పార్టీలుగా చేర్చారు.
Read Also:Realme 13 Pro Series: ఏఐ కెమెరా ఫీచర్‌తో రియల్‌మీస్మార్ట్‌ఫోన్స్.. ధర, బ్యాటరీ డీటెయిల్స్ ఇవే!