CM Jagan: విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాద ఘటన.. మత్స్యకారులకు ఏపీ సర్కార్ భారీ సహాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదం కారణంగా బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు కనీవినీ ఎరుగని రీతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహాయం ప్రకటించారు. దగ్ధమైన బోట్ల విలువలో 80 శాతం మేర పరిహారంగా అందించాలని ఆదేశించారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ ఘటనపై ఈ ఉదయం జరిగిన సమావేశంలో సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు.
Read Also: PM MODI: ఓటమి బాధలో టీమిండియా ఆటగాళ్లు.. డ్రెసింగ్ రూమ్కు వెళ్లి ఓదార్చిన ప్రధాని
Also Read
- HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
- Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
- Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Student Protests: రేప్ నుంచి దెయ్యం వరకు.. పుకార్లతో రగిలిపోతున్న యూనివర్సిటీలు.!
కాగా, ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు మంత్రి సీదిరి అప్పలరాజు సహా జిల్లా కలెక్టర్ సంఘటన స్థలానికి చేరుకుని బాధితులకు పూర్తి భరోసానిచ్చామని వివరించారు. ప్రమాదంలో 36 బోట్లు దగ్ధం కాగా, మరో 9 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మట్లాడుతూ.. ప్రమాదంలో బోట్లు దగ్ధం కావడం మత్స్యకారుల జీవితాలకే పెద్ద దెబ్బ అని.. ఇలాంటి పరిస్థితుల్లో వారి జీవితాలను నిలబెటాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. సహాయం విషయంలో అత్యంత మానవతాధృక్ఫధంతో వ్యవహరించాలన్నారు. మానవత్వం అనే పదానికి అర్ధం చెబుతూ.. మత్స్యకారుల జీవితాలను తిరిగి నిలబెట్టేలా ఈ సాయం ఉండాలని సీఎం చెప్పారు. అందుకే ఈ విషయంలో ఉదారంగా ఉండాలని ఆదేశించారు.
Read Also: Tammineni Sitaram: చంద్రబాబు దొరికిన కాడికి దోచుకున్నారు..
దగ్ధమైన బోట్ల విలువలో 80 శాతం మేర పరిహారంగా ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. మత్స్యకారుల తిరిగి తమ జీవితాలను నిలబెట్టుకునేలా అండగా ఉండాలన్నారు. బోట్లకు బీమా లేదనో, లేక మరో సాంకేతిక కారణాలనో చూపి వారి జీవితాలను గాలికి వదిలేయడం సరికాదు అని ఆయన చెప్పారు. ఇలాంటి కష్టం కాలంలోనే వారికి పూర్తి భరోసా కల్పించాల్సిన బాధ్యత ఉందని సీఎం అధికారులకు స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాద సమయాల్లో ఇబ్బంది లేకుండా ఇన్సూరెన్స్ చేయించుకునేలా అధికారులు తగిన తోడ్పాటు అందించాలని జగన్ అన్నారు.
Read Also: Tragedy: సాంబార్ గిన్నెలో పడి రెండో తరగతి బాలిక మృతి
ఇక, ప్రాథమిక అంచనా ప్రకారం బోట్లు దగ్ధం కారణంగా దాదాపు 12 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్టుగా అధికారులు తుది నివేదిక సిద్ధం చేస్తున్నారని సీఎంఓ అధికారులు సీఎం జగన్ కి వివరించారు. అంతకు ముందు విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో మత్స్యకారుల బోట్లు దగ్ధమైన సమాచారం తెలిసిన వెంటనే సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి కారణాలు వెలికి తీయాలని అధికారులను ఆదేశించారు.
తాజావార్తలు
-
CDSCO: పదేపదే ట్యాబ్లెట్లు వాడుతున్నారా?
-
HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
-
Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
-
Explainer: మరిన్ని విపత్తులు తప్పవా?
-
Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!