YS Jagan: జగన్ ఎన్నికల శంఖారావం.. యుద్ధానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు సీఎం వైఎస్ జగన్.. భీమిలి నియోజకవర్గంలోని సంగివలసలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది.. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీగా తరలివచ్చాయి వైసీపీ శ్రేణులు.. సిద్ధం పేరుతో నిర్వహించిన ఈ సభా వేదిక నుంచి.. యుద్ధానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా? అంటూ ప్రశ్నించారు.. వారి నుంచి సిద్ధం అంటూ సమాధానాన్ని రాబట్టారు.. ఈ యుద్ధానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా?, ఒంటరి పోరాటానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా? దుష్ట చతుష్టయాన్ని, గజ దొంగల ముఠాని ఓడించడానికి నేడు సిద్ధం.. మీరు సిద్ధమా? అంటూ ప్రశ్నించి వారి స్పందన తీసుకున్నారు. ఇక, వచ్చే రెండు నెలలు మనకు యుద్ధమే.. ఈ రెండు నెలలు మీరు సైన్యంగా పని చేయాలి.. దుష్టచతుష్టయం సోషల్ మీడియాలో చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి.. మన టార్గెట్ 175కు 175 అసెంబ్లీ, 25కు 25 ఎంపీ స్థానాలు గెలవడమే అని స్పష్టం చేశారు.
Read Also: Rajinikanth: విజయ్ గురించి నేను తప్పుగా మాట్లాడలేదు.. అర్థమైందా రాజా..?
Also Read
- Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
- US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
- Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసు
- Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
ఇక, ప్రతి పక్షాలకు ఓటేయడం అంటే దాని అర్ధం.. మాకు ఈ స్కీములు వద్దని, ఈ స్కీములకు రద్దుకు ఆమోదం తెలిపినట్లేనని గ్రహించాలి.. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి.. మన సంక్షేమ ఫలాలు అందుకునే ప్రతీ వ్యక్తి మనకు స్టార్ క్యాంపెయినరే.. వాళ్లను మరికొంతమందికి చెప్పేలా ప్రోత్సహించాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు సీఎం జగన్.. పొత్తు లేకపోతే పోటీ చేయడానికే అభ్యర్థులే లేని వీరంతా పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు.. వారి మాటలు వింటుంటే కొన్ని సామెతలు గుర్తుకువస్తున్నాయి.. ఓటి కుండకు మోత ఎక్కువ.. చేతగాని వాడికి మాటలు ఎక్కువ అనే సామెతలు గుర్తుకు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. మన ప్రభుత్వం చేసిన మంచిని ప్రతీ ఇంటికి వెళ్లి చెప్పండి.. పేదల భవిష్యత్ మారాలంటే.. జగనే గెలవాలని చెప్పండి.. ప్రపంచంతో పోటీ పడేలా మీ పిల్లలు చదవాలంటే జగన్ రావాలని చెప్పండి.. ప్రతి నెలా ఒకటో తేదీన పెన్షన్ రావాలంటే.. జగన్ గెలవాలని చెప్పండి.. పేదలకు నాణ్యమైన వైద్యం అందాలంటే.. జగన్ సీఎం అవ్వాలని చెప్పండి.. మీ బిడ్డ నమ్ముకుంది దేవుడిని, మిమ్మల్ని మాత్రమే.. ప్రజలే.. నా స్టార్ క్యాంపెయినర్లు అని వ్యాఖ్యానించారు వైఎస్ జగన్.
తాజావార్తలు
-
Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
-
US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
-
Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసు
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..