Rajinikanth: విజయ్ గురించి నేను తప్పుగా మాట్లాడలేదు.. అర్థమైందా రాజా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ వయస్సులో కూడా కుర్ర హీరోలకు పోటీగా చేతిలో మూడు నాలుగు సినిమాలను పెట్టుకొని షాక్ ఇస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రాల్లో లాల్ సలామ్ ఒకటి. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ అల్లిరాజా నిర్మించిన ఈ సినిమాకు రజినీ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తుంది. విష్ణు విశాల్, విక్రాంత్, జీవిత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు సిద్దమవుతుంది. ఈ సినిమాలో రజినీ మొయిద్దీన్ భాయ్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక లాల్ సలామ్ ఆడియో లాంచ్ ను మేకర్స్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకలో రజినీ.. హిందూ మతం, సనాతన ధర్మం, భగవద్గీత మొదలైన అంశాలపై తన అభిప్రాయాల్ని పంచుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా జైలర్ ఆడియో వేడుకలో అర్థమైందా రాజా స్పీచ్ పై స్పందించాడు.
జైలర్ ఆడియో లాంచ్ వేడుకలో రజినీ చెప్పిన కాకి- డేగ కథ ఎంత పెద్ద వివాదాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పక్షుల ప్రపంచంలో కాకి ప్రతి ఒక్కరినీ కలవరపెడుతుంది. అయితే, ఒక డేగ నిశ్చలంగా ఉంటుంది. ఒక కాకి డేగను బాధపెట్టినప్పుడు, డేగ స్పందించదు. ఇది కేవలం తదుపరి దశకు వెళుతుంది. ఈ సారూప్య త డేగ వంటి ఉన్నతమైన శక్తి కాకి చర్యలతో బాధపడదు.. మొరగని కుక్కలేదు. విమర్శించని నోరు లేదు. ఈ రెండూ జరగని ఊరే లేదు. మనం మన పని చూసుకుంటూ పోతూనే ఉండాలి.. ఇదంతా తమిళంలో చెప్పిన రజనీకాంత్, ఆఖరిలో అర్థమైందా రాజా? అంటూ మాట్లాడిన విధానం అప్పట్లో ఎంత సంచలనంగా మారింది. అయితే ఈ మాటలన్నీ హీరో విజయ్ గురించే మాట్లాడినట్లు నెటిజన్స్ తప్పుగా అర్ధం చేసుకుని రజినీపై విమర్శలు గుప్పించారు.
Also Read
తాజాగా లాల్ సలామ్ ఈవెంట్ లో ఈ విమర్శలపై స్పందించాడు రజినీ. ” నేను మాట్లాడిన మాటలను మీరు తప్పుగా అర్ధం చేసుకున్నారు. నేను హీరో విజయ్ గురించి తప్పుగా మాట్లాడలేదు.నేనేదో విజయ్ ఫై దాడి చేస్తున్నట్లు అనుకున్నారు. ప్రజలు మా గురించి అలా మాట్లాడుకోవడం నాకు చాలా బాధగా అనిపించింది. మేము ఇద్దరం.. మా మార్గాల్లో మాకు తగినట్లు పోతూనే ఉన్నాం. చిన్నప్పటి నుంచి విజయ్ నాకు తెలుసు. పెద్ద స్టార్‌గా ఎదిగి రాజకీయాల్లోకి వచ్చి సామాజిక సంక్షేమంలో నిమగ్నమవుతున్నాడు. నేను ఎల్లప్పుడూ అతనికి మద్దతుగా ఉంటాను. మా ఇద్దరి మధ్య విబేధాలను తీసుకురాకండి” అంటూ చెప్పుకొచ్చాడు. మరి ఈ వ్యాఖ్యలు ఎలాంటి వివాదాన్ని తీసుకొస్తాయో చూడాలి.
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!