తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆన్ లైన్ బెట్టింగ్ వ్యవహారంపై సీరియస్ అయ్యారు. ఆన్ లైన్ బెట్టింగ్ నిషేధిస్తూ గత ప్రభుత్వం చట్టం చేసింది కానీ, అది అమలు కాలేదని అన్నారు. ఆన్ లైన్ బెట్టింగ్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. విమర్శల జోలికి పోను.. ఆన్‌లైన్ రమ్మి.. బెట్టింగులపై కఠినంగా ఉంటామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
Also Read:Lady Aghori: కుటుంబంలో అఘోరీ అలజడి.. అసలేం జరిగింది..!
బెట్టింగ్ వ్యవహారంపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేస్తున్నామని తెలిపారు. వచ్చే సమావేశాల్లో ఆన్లైన్ బెట్టింగులుపై చట్ట సవరణ చేస్తామన్నారు. గుట్కా నిషేధిత పదార్థాలు మార్కెట్లో కి వచ్చాయి. వీటిపై కూడా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసే వారిని పిలిచి విచారిస్తున్నాము. దానితో పరిష్కారం కాదు. బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తున్న వారు.. బాధ్యులను కూడా విచారించాలన్నారు. దీనికోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేస్తున్నాం. ప్రకటనలు చేసినా.. నిర్వహణలో భాగస్వామ్యం ఉన్న.. కఠినంగా వ్యవహారం ఉంటుందని సభలో సిఎం రేవంత్ ప్రకటించారు.
Also Read:Rahul Gandhi: లోక్‌సభ స్పీకర్‌పై రాహుల్‌గాంధీ గరం గరం
నేరాలు చెప్పి జరగవు. నేరాల పట్ల అప్రమత్తంగా ఉంటుంది ప్రభుత్వం. న్యాయవాదుల హత్య.. వెటర్నరీ డాక్టర్ హత్యలు గతంలో చూశాం. నడి బజారులో న్యాయవాదులను చంపిన వారిపై సీబీఐ విచారణకి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సుప్రీం కోర్టుకు చెప్పినం. ఆరేళ్ల అమ్మాయిని సైదాబాద్ లో చంపితే అనాడు సర్కార్ పట్టించుకోలేదు. జూబ్లీహిల్స్ లో మైనర్ బాలిక రేప్ కేసు.. దాంట్లో బీఆర్ఎస్ నాయకుడు ముద్దాయి. ఇలాంటి ఘటనల్లోని బాధితుల పట్ల సానుభూతితో ఉండాలి. కానీ ప్రతిపక్షం.. ప్రభుత్వమే చేయిస్తుంది అన్నట్టు మాట్లాడుతున్నారు అని సీఎం రేవంత్ మండిపడ్డారు.