OnePlus 13s: వన్‌ప్లస్ సంస్థ నేడు (జూన్ 5) ఫ్లాగ్‌షిప్ ఫోన్ OnePlus 13s ని అధికారికంగా భారత మార్కెట్లో విడుదల చేసింది. అదిరిపోయే లుక్స్, డిజైన్ తోపాటు శక్తివంతమైన ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్ టెక్ ప్రియులను ఆకట్టుకునేలా ఉంది. ప్రధానంగా ఇది 6.32 అంగుళాల 1.5K LTPO AMOLED డిస్‌ప్లేను కలిగి ఉండగా.., క్వాల్‌కం స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. మరి ఈ ప్రీమియం ఫోన్ పూర్తి స్పెసిఫెక్షన్స్ ను ఒకసారి చూద్దామా..
Read Also: RCB IPL 2025 Winner: అరగుండు, మెడలో చెప్పుల దండ.. ఛాలెంజ్‌ను నిలబెట్టుకున్న తాండూర్ యువకుడు!
OnePlus 13s లో 6.32 అంగుళాల 1.5K LTPO AMOLED స్క్రీన్ ఉంది. ఇది 1Hz నుంచి 120Hz వరకు డైనమిక్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. ఇది డాల్బీ విజన్‌కు మద్దతు ఇస్తుంది. బాటమ్, టాప్, సైడ్ బెజల్స్ అతి సన్నగా ఉండటంతో ఈ ఫోన్ చాలా కాంపాక్ట్ గా ఉన్నట్లు అనిపిస్తుంది. మెటల్ ఫ్రేమ్ తో పాటు 2.5D కర్వ్డ్ గ్లాస్ డిజైన్ దీని ఆకర్షణలో మరింత మెరుగుదల తీసుకువచ్చింది.

ఇక ఈ మొబైల్ లో 4.32GHz క్లాక్ స్పీడ్ కలిగిన స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ 4nm చిప్ సెట్ ఉంది. దీనితో పాటు 12GB RAM, 256GB లేదా 512GB UFS 4.0 స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఆక్సిజన్ OS 15 ఆధారిత ఆండ్రాయిడ్ 15తో వస్తుంది. ఈ మొబైల్ కు 4 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్డేట్లు, 6 సంవత్సరాల భద్రతా అప్డేట్లు లభించనున్నాయి. ఇక కెమెరా ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో.. వన్‌ప్లస్ 13s వెనుకవైపు 50MP ప్రాధమిక కెమెరా (Sony LYT-700 సెన్సార్), 50MP 2x టెలిఫోటో లెన్స్ ఉంది. అయితే ఈ ఫోన్‌లో అల్ట్రావైడ్ కెమెరా లేదు. ముందు భాగంలో 32MP అల్ట్రా ఫోకస్ కెమెరా ఉంది. ఇది 4K 30fps వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుంది.
Read Also: SSC Phase 13 Recruitment 2025: మళ్లీరాని ఛాన్స్.. ఎస్ఎస్ సీలో 2423 జాబ్స్.. మిస్ చేసుకోకండి

ఇక ఇతర ముఖ్యమైన ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 5,850mAh బ్యాటరీతో పాటు 80W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్, IP65 వాటర్, డస్ట్ రెసిస్టెంట్, డ్యూయల్ 5G, Wi-Fi 7, Bluetooth 6.0, ఇంటెగ్రేటెడ్ ప్లస్ కీ లాంటి మరికొన్ని ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. కొత్త G1 Wi-Fi చిప్ ద్వారా మెరుగైన కనెక్టివిటీ, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు, నాలుగు మైక్రోఫోన్లులు కూడా ఇందులో ఉన్నాయి.

OnePlus 13s బ్లాక్ వెల్వెట్, పింక్ శాటిన్, ఇండియా ఎక్స్‌క్లూజివ్ గ్రీన్ సిల్క్ వంటి మూడు ఆకర్షణీయమైన కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇక ధర విషయానికి వస్తే.. 12GB + 256GB వేరియంట్ ధర రూ. 54,999 కాగా.. 12GB + 512GB వేరియంట్ ధర రూ. 59,999 గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ను OnePlus అధికారిక వెబ్‌సైట్, అమెజాన్, వన్ ప్లస్ ఎక్స్పీరియన్స్ స్టోర్స్, రిలయన్స్ డిజిటల్, క్రోమా, విజయ్ సేల్స్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వంటి ఆఫ్లైన్ రిటైల్ స్టోర్లలో జూన్ 12 నుంచి కొనుగోలు చేయొచ్చు. ప్రీ-బుకింగ్‌లు రూ.1999తో ఈరోజు నుంచే అమ్మకాలు ప్రారంభమయ్యాయి.

ఇక ప్రీ-బుకింగ్ ఆఫర్ల కింద.. SBI కార్డ్‌దారులకు రూ.5000 తగ్గింపు లేదా ఎక్సేంజ్ బోనస్, 15 నెలల వరకు నో-కాస్ట్ EMI, 180 రోజుల ఫోన్ రీప్లేస్‌మెంట్ ప్లాన్, 3 ఏళ్ల బ్యాటరీ ప్రొటెక్షన్ ప్లాన్, ముఖ్యంగా రూ. 2099 విలువైన Nord Buds 3 ఉచితంగా లభిస్తాయి.