ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి శనివారం సాయంత్రం కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించారు. సీఎంతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించిన వారిలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ రవి గుప్త ఉన్నారు.