NTV Telugu Site icon

CM Revanth Reddy : వాళ్లకి జైల్లో డబుల్‌రూం కట్టిస్తానని హామీ ఇచ్చా.. ఆ హామీ కూడా ఇంకా నెరవేర్చేలేదు

Revanth

Revanth

CM Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి విచక్షణాధికారులు ఉపయోగిస్తే మీరు ఒక్కరైనా బయట ఉండేవారా..? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌ కుటుంబానికి జైల్లో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు కట్టిస్తా అని ఎన్నికల హమీ ఇచ్చానన్నారు.. ఆ హామీ కూడా ఇంకా నెరవేర్చలేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు ఏకమొత్తంలో రూ.లక్ష రుణమాఫీ చేస్తామన్నారని, ఎన్నిలయ్యాక రుణమాఫీకి ఐదేళ్ల సమయం పట్టిందని మండిపడ్డారు సీఎం రేవంత్‌ రెడ్డి. రెండోసారి రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చి.. నాలుగేళ్లు చేయలేదన్నారు. పదేళ్లలో 21 లక్షల మంది రైతులకు 16,908 కోట్లు రుణమాఫీ చేశారు. మేం 25 లక్షల మంది రైతులకు రూ.20 వేల కోట్లు రెండు లక్షల చొప్పున రుణమాఫీ చేశామని ఆయన తెలిపారు. రైతుబంధు ఎన్నికల కోడ్‌ను అడ్డం పెట్టుకొని వారు పారిపోయారని, వారు ఎగ్గొట్టిన డబ్బును నేను సీఎం అయ్యాక చెల్లించాను అని ఆయన పేర్కొన్నారు. మొదటి విడత రూ.7625 కోట్లు నేను చెల్లించా అని సీఎం రేవంత్‌ తెలిపారు.

MP Avinash Reddy: ఇంత తక్కువ టైంలోనే టీడీపీ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది!

మేం అధికారంలోకి వచ్చాక రైతు భరోసా పథకం కింద రూ.12 వేల కోట్లు చెల్లించామన్నారు. వాళ్లు వరి పండించి రూ.4500కు అమ్మకున్నారని, పేద రైతులకు మాత్రం వరేస్తే ఉరే అని ప్రచారం చేశారన్నారు. మేం వరి వేయమని చెప్పి, బోనస్‌ కూడా ఇచ్చామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఉచిత కరెంట్‌ కనిపెట్టిందే కాంగ్రెస్‌ అని, మీరు పదేళ్లు చేయలేని పనులు పది నెలల్లో చేసి చూపామని కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారన్నారు. కడుపులో కత్తులు పెట్టుకొని మాట్లాడుతున్నారని సీఎం రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. వారి హయాంలో అకాల వర్షాలకు ఏనాడు నష్టపరిహారం ఇవ్వలేదని, మేం నష్టపరిహారం చెల్లించామన్నారు. కష్టపడి పనిచేస్తున్నానని ప్రతిపక్ష నాయకుడు చెప్పొచ్చు కదా అని సీఎం రేవంత్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి నాలుగు రకాలుగా అప్పు చేసుకునే అవకాశం ఉంటుందని, మూడు రకాల అప్పులు కలిపి తెలంగాణ ఏర్పడే నాటికి 90 వేల 160 కోట్ల అప్పు ఉండేదన్నారు. 1 డిసెంబర్‌ 2023 నాటి అప్పు రూ. 6,69,257 కోట్లు అని సీఎం రేవంత్‌ రెడ్డి వివరించారు.

Ambati Rayudu: ఐపీఎల్లో అతనే నన్ను బాగా ఇబ్బంది పెట్టాడు.. అంబటి రాయుడు హాట్ కామెంట్స్