CM Revanth Reddy: ప్రస్తుతం అంగరంగ వైభవంగా జరుగుతున్న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర సందర్భంగా.. పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇందులో భాగంగా.. హర్యానా గవర్నర్, బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు బండారు దత్తాత్రేయ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కొండ సురేఖ, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Read Also:Police Harassment: మహిళా సిఐ వేధింపులు తాళలేక యువకుడి ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో రికార్డ్..!
ఈ సందర్బంగా.. ఆలయ అర్చకులు సీఎం రేవంత్ రెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సీఎం వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సలహాదారు వేం. నరేందర్ రెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే, మంత్రి కొండ సురేఖ అమ్మవారికి బోనం సమర్పించి.. రాష్ట్ర ప్రజల క్షేమం కోసం ప్రార్థనలు చేశారు. ఈ ఏడాది జాతర వేడుకలు భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరుగుతుండగా.. ప్రజాప్రతినిధుల హాజరుతో ఆలయ ప్రాంగణం హడావిడిగా మారింది.
Read Also:Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు ఆధ్వర్యంలో పోలీసు రాజ్యం నడుస్తుంది..