CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. పట్టభద్రులు గుండె మీద చేయి పెట్టుకొని ఆలోచించాలని కోరుతూ, బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా, కేటీఆర్, హరీష్ రావు కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించాలనే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మంచిర్యాలలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత పట్టభద్రుల లే కదా. వీరు ఎవ్వరికి ఓటు వేస్తారు? ఎవ్వరికీ మద్దతు ఇస్తారు?” అంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా, బీఆర్ఎస్ నాయకులు ఢిల్లీలో చేసిన మంతనాలు, వారి వ్యూహాలను ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. “ఎంపీ ఎన్నికల్లో మీ 8 సీట్లలో డిపాజిట్ పోయింది. అదే స్థానాల్లో బీజేపీ 8 మంది గెలిచారు. మీ రాజకీయ వ్యూహం ప్రజలకు అర్థమైంది,” అని మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి 12 ఏళ్లలో తుమ్మిడి హెట్టి వద్ద మహారాష్ట్ర నుంచి అనుమతి తీసుకుని ఉంటే, తెలంగాణలో అడవుల జిల్లాల అభివృద్ధి జరిగేదని చెప్పారు. కానీ, గత ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదని విమర్శించారు. “11,000 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. నిజమైతే మాకు ఓటు వేయండి, అబద్ధమైతే మీకు ఇష్టమైన వారికి ఓట్లు వేయండి,” అని ప్రజలకు పిలుపునిచ్చారు.
Sambhal Mosque: ఏఎస్ఐ అనుమతి లేకుండా “సంభాల్ మసీదు”లో ఎలాంటి పనులు జరగకూడదు..
సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీపై కూడా విమర్శలు గుప్పించారు. “ప్రధాని మోదీ 11 ఏళ్ల పాలనలో కేవలం రెండు ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. ఒకటి కిషన్ రెడ్డికి, రెండోది బండి సంజయ్‌కి,” అని ఎద్దేవా చేశారు. ఒలింపిక్ గేమ్స్‌లో ఇప్పటివరకు ఒక్క గోల్డ్ మెడల్ కూడా సాధించలేదని పేర్కొంటూ, 2028 ఒలింపిక్స్‌లో తెలంగాణ నుంచి గోల్డ్ మెడల్ సాధించేలా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. “మీ ఆదిలాబాద్‌కు యూనివర్శిటీ రావాలంటే మీ ఆశీర్వాదం కావాలి,” అంటూ ప్రజలను కోరారు.
రైతుల సమస్యలపై మాట్లాడుతూ, “రుణ మాఫీ జరిగింది అంటే కాంగ్రెస్‌కే ఓటు వేయండి. వరి వేస్తే ఊరే అన్నాడు కేసీఆర్. కానీ, మన ప్రభుత్వం వరి వేసిన రైతులకు బోనస్ ఇచ్చింది,” అని తెలిపారు. “వేలాది ఉద్యోగాలు ఇచ్చే అమెరిన్ కంపెనీలను గుర్తించి తెలంగాణకు తీసుకువచ్చాం. 25.40 లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేయించిన ఘనత మాది కాదా?” అని ప్రశ్నించారు.
రుణ మాఫీ జరిగిన కుటుంబాలన్నీ నరేందర్ రెడ్డికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అలాగే, రైతు భరోసా పథకం కింద 3 ఎకరాల వరకు భరోసా ఇచ్చినట్లు తెలిపారు. మార్చి 31వరకు అందరికీ భరోసా అందుతుందని హామీ ఇచ్చారు.
ఇంటికి 200 యూనిట్లు ఉచితంగా ఇస్తే మాకు ఓటు వేయండి అంటూ ప్రజలను కోరారు. మహిళల సాధికారతపై మాట్లాడుతూ, “ఆడబిడ్డలు వంటింటి కుందేలు కాదు. సోలార్ పవర్ ద్వారా మహిళలను అదానీతో పోటీ పడే స్థాయికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం,” అని వివరించారు.
బీసీల హక్కుల గురించి మాట్లాడుతూ, “96 ఏళ్లలో ఏనాడైనా బీసీ లెక్కలు తీసారా? 56.33% బీసీలు ఉన్నారని నేను తేల్చి చెప్పా. 12 ఏళ్లలో వారు బీసీ గణన చేయలేదు, కానీ 12 నెలల్లో నేను చేసి చూపించా,” అని వివరించారు.
రేవంత్ రెడ్డి బీజేపీ, బీఆర్ఎస్‌ల మధ్య ఉన్న సీక్రెట్ అండర్స్టాండింగ్ గురించి మాట్లాడుతూ, “ఎన్నికల్లో పోటీ చేయనోడు, కాంగ్రెస్‌ను ఓడించడానికి కోట్లాడే వారిని కాళ్లు పట్టి లాగుతున్నాడు,” అని తీవ్ర విమర్శలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాట్లాడుతూ, “ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును కాపాడేది బండి సంజయ్ నువ్వే కదా? వారిని తెచ్చి అప్పగిస్తే, మేము కేసీఆర్, కేటీఆర్‌ను ఎప్పుడు అరెస్టు చేస్తామో చూడండి,” అని హెచ్చరించారు.
సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను హైలైట్ చేస్తూ, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయనే విషయాన్ని నొక్కిచెప్పారు. ప్రజలందరూ నిజమైన అభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
RK Roja: వైఎస్ జగన్తో ఆర్కే రోజా భేటీ.. నగరిలో తాజా పరిణామాలపై చర్చ..!