CM Revanth Reddy: ఆదివాసీ సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. సమస్యలు చెప్పుకున్న ప్రతినిధులు
- ఆదివాసీ సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
- మంత్రి సీతక్క..ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ చొరవ
- సీఎంకు తమ సమస్యలు చెప్పుకున్న ప్రతినిధులు
- దీపావళి లోపు సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం
- సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ హామీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆదివాసి సంఘాలు భేటీ అయ్యాయి. జూబ్లీహిల్స్ లోని సీఎం అధికారిక నివాసంలో బుధవారం భేటీ అయిన పలు సంఘాల ప్రతినిధులు..తమ ప్రాంత సమస్యలను సీఎం కి వివరించారు. జైనూరు ఘటన దరిమిలా ఆదివాసులు, మైనారిటీ వర్గాల మధ్య సఖ్యత కుదుర్చేందుకు ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఇరు వర్గాలతో ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపారు. దీనికి కొనసాగింపుగా మంత్రి సీతక్క, ఎమ్మెల్యే బొజ్జు పటేల్ చొరవ తీసుకొని ఆదివాసి సంఘాలను తొడ్కొని సీఎం రేవంత్ రెడ్డి తో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తమ సమస్యలను ఆదిలాబాద్ ఆదివాసి సంఘాల ప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. స్థానికంగా తమకు ఎదురవుతున్న ఇబ్బందులను వివరిస్తూ వినతి పత్రాలు అంద చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల హక్కులను కాపాడే విధంగా చర్యలు చేపట్టాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.
Read Also: Gutha Sukender Reddy: మూసీపై డీపీఆర్ కాకముందే ఆరోపణలు.. ఇది సరికాదు..
Also Read
- Nashik TCS Case: నాసిక్ టీసీఎస్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..
- Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆకస్మిక ధన లాభాలు.!
- Vaibhav Sooryavanshi: టీమిండియాలోకి 15 ఏళ్ల వండర్ కిడ్.. వైభవ్ ఎంట్రీతో జట్టులో బలి అయ్యేది ఎవరు?
- Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
తమ భూములు, ఉద్యోగాలు తమకే దక్కేలా చూడాలని కోరారు. ఆదివాసీల సమస్యలు సావధానంగా విన్న రేవంత్ రెడ్డి..దీపావళి లోపు సచివాలయంలో అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తామని, ఆ సమావేశానికి ఆదివాసి సంఘాలను, ముఖ్యలను ఆహ్వానిస్తామని, ఆ సమావేశంలోనే ఆదివాసీల డిమాండ్ల సాధ్యసాధ్యాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని ఆదివాసి సంఘాలకు హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ కలెక్టర్ గా పనిచేసి అక్కడి సమస్య పట్ల పూర్తి అవగాహన ఉన్న దివ్య దేవరాజన్ ను అక్కడికి పంపించి చేపట్టాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించెందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నందున ప్రభుత్వానికి సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదివాసి సంఘాల ప్రతినిధులకు సూచించారు. ఈ సందర్భంగా తమ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి, సమస్యను పరిష్కరించే దిశలో చూపి సీఎంతో సమావేశం ఏర్పాటు చేసిన మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, అదిలాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణకు ఆదివాసీ సంఘాల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.
తాజావార్తలు
-
Peddi Controversy : ‘పెద్ది’ ముద్దుపై బుచ్చిబాబు ఫస్ట్ రియాక్షన్… ఏమన్నారంటే?
-
Nashik TCS Case: నాసిక్ టీసీఎస్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆకస్మిక ధన లాభాలు.!
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 వచ్చేస్తోంది.. 7560mAh బ్యాటరీ, మీడియాటెక్ ప్రాసెసర్, డ్యూయల్ కెమెరా
-
Vaibhav Sooryavanshi: టీమిండియాలోకి 15 ఏళ్ల వండర్ కిడ్.. వైభవ్ ఎంట్రీతో జట్టులో బలి అయ్యేది ఎవరు?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!