తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆరు గ్యారంటీలు అమలు చేయకపోవడానికి కారణం.. బీఆర్ఎస్సే కారణమని మండిపడ్డారు. తెలంగాణ అప్పు 7 లక్షల 22 వేల కోట్లు.. వాళ్ళు తెచ్చిన అప్పు 11.5 వడ్డీ అని అన్నారు. వడ్డీ తగ్గించండి అని అడుక్కుంటాం.. వేరే దేశాల్లో ఐతే ఉరి తీసేవాళ్ళని ఆరోపించారు.