యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. కొందరు తీసుకున్న నిర్ణయాలే చరిత్రలో నిలిచి పోతాయి.. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా.. పీవీ సంస్కరణలు గుర్తించాల్సిందే.. అధికారులకు విజ్ఞప్తి.. మేము విధివిధానాలు సృష్టిస్తాం.. దాన్ని అమలు చేయాల్సింది మీరు.. నా బ్రాండ్ యంగ్ ఇండియా.. యంగ్ ఇండియా యూనివర్సిటీ ఏర్పాటు చేసుకుంటున్నాం.. ఒక్కొక్కరికి ఒక్కో బ్రాండ్ ఉంటుంది.. నా బ్రాండ్ యంగ్ ఇండియా అని తెలిపారు.
Also Read:Nandamuri : ‘బాల’ బాబాయ్ తో కలసి నటిస్తాను : కళ్యాణ్ రామ్
సౌత్ కొరియా ఒక చిన్న స్పోర్ట్స్ యూనివర్సిటీ దేశ ఖ్యాతిని పెంచింది.. ఇంత పెద్ద దేశంలో ఒలంపిక్స్ లో చిన్న మెడల్ కూడా రాలేదు.. ఇంజనీరింగ్ పట్టా తీసుకుని పోతే.. తల్లిదండ్రులకు సంతోషం.. ఉద్యోగాల కోసం కంపెనీలకు పోతే.. అప్లికేషన్ కూడా నింపలేని పరిస్థితి.. యంగ్ ఇండియా స్కూల్ యూనివర్సిటీనీ బెస్ట్ యూనివర్సిటీగా రూపొందిస్తాం.. రాజకీయ ఆలోచనలు చేయలేదు స్కిల్ యూనివర్సిటీలో.. సక్సెస్ ఉన్న కంపెనీలు ఇందులో భాగస్వామ్యం అయ్యాయి.. యంగ్ ఇండియా స్కూల్ యూనివర్సిటీలో చేరిన వాళ్ళకి 100 శాతంఉద్యోగాలు వచ్చాయి.. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో కూడా పెద్ద కంపెనీలు పోటీ పడుతున్నాయి..
Also Read:TDP: వైఎస్ భారతిపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. ఐటీడీపీ కార్యకర్తపై అధిష్టానం చర్యలు..
ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో కనీస వసతులు లేవు.. ప్రతి నియోజక వర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం.. 25 ఎకరాల్లో స్కూల్.. ప్రతీ స్కూల్ కి 200 కోట్లు.. విద్యా విధానంలో చిన్న గ్యాప్ ఉంది.. ప్రైవేటు స్కూల్ లో విద్యార్ధులు ఎక్కువ.. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యావంతులు.. కానీ ఇక్కడ చదివే పిల్లలు 18 లక్షల మందే చదువుతున్నారు.. నర్సరీ.. కూడా ప్రభుత్వ స్కూలులో ఏర్పాటు చేయాలని.. ప్లే స్కూల్ పెట్టాలని మా ఆలోచన.. త్వరలోనే అమలులోకి తెస్తాం.. సైనిక్ స్కూల్ తో మనం పోటీ పడాలి..
Also Read:Jack Review: సిద్ధు జొన్నలగడ్డ ‘జాక్’ రివ్యూ
ఎందుకు పోటీ పడటం లేదో ఆలోచన చేయండి.. మీ బ్రాండ్ మీరు క్రియేట్ చేయండి.. మీతో ప్రభుత్వం ఉంది.. మీకేం కావాలో అది తీర్చుకోండి.. నేను ఉన్నంత కాలం మీకు నిధులు.. అనుమతులకు లోటు ఉండదు.. ఐటీ కంపెనీలతో మాట్లాడండి.. 100 కోట్లు కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసుకోండి.. యంగ్ ఇండియా అనే టైటిల్ గాంధీ పెట్టారు.. గాంధీ స్పూర్తి నుండే యంగ్ ఇండియా స్కూల్..యూనివర్సిటీ.. విద్య.. ఉద్యోగం.. ఉపాధి నా బ్రాండ్ అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.