తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనసభలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సంతాప తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. “విద్యార్థి దశ నుంచే గోపినాథ్ చురుకుగా ఉండేవారు.. 1983లో తెలుగుదేశం పార్టీలో గోపీనాథ్ తన రాజకీయ ప్రస్థానాన్ని గోపీనాథ్ ప్రారంభించారు..1985 నుంచి 1992 వరకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తెలుగు యువత అధ్యక్షుడిగా పని చేశారు.. 1987-88 లో హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ డైరెక్టర్‌గా, 1988-93 లో జిల్లా వినియోగదారుల ఫోరం సభ్యుడిగా పనిచేశారు.. గోపీ ఎన్టీఆర్ కు గొప్ప భక్తుడు.. సినీ రంగంలోనూ గోపీనాథ్ నిర్మాతగా రాణించారు.
Also Read:Cloudburst: జమ్మూకాశ్మీర్‌లో మళ్లీ క్లౌడ్ బరస్ట్.. ఏడుగురు మృతి.. పలువురు గల్లంతు
సినిమా రంగంపై అభిమానంతో ‘పాతబస్తీ’(1995), ‘రవన్న’(2000), ‘భద్రాద్రి రాముడు’ (2004), ‘నా స్టైలే వేరు’ (2009) వంటి నాలుగు సినిమాలకు గోపీనాథ్ నిర్మాతగా వ్యవహరించారు.. మాగంటి గోపినాథ్ నాకు మంచి మిత్రుడు.. రాజకీయంగా పార్టీలు వేరైనా.. వ్యక్తిగతంగా నాకు మంచి మిత్రుడు.. వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఘనత సాధించిన వారిలో ఆయన ఒకరు.. ఆయన మరణం వారి కుటుంబానికి తీరని లోటు.. ఆయన అకాల మరణం ఆ కుటుంబానికి శోకాన్ని మిగిల్చింది.. చూడటానికి ఆయన క్లాస్ గా కనిపించినా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఆయన మాస్ లీడర్.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నా” అని తెలిపారు.