CM Revanth Reddy: ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయలుదేరారు. ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా అసెంబ్లీకి సీఎం వెళ్లనున్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి పై శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సీఎం రేవంత్ ఇవ్వనున్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ సందర్భంలోనే తెలంగాణ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య హాట్ హాట్ గా చర్చలు జరిగాయి. తాజాగా మూడు రోజుల విరామం అనంతరం సభ ఇవాళ ఉదయం 11 గంటలకు స్టార్ట్ కాబోతుంది. ఇవాళ, రేపు శాసన సభ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వ నిర్ణయించింది. ఇవాళ అసెంబ్లీలో ఆర్థిక స్థితిగతులుపై స్వల్ప కాలిక చర్చ జరగనుంది. రేపు విద్యుత్ రంగంపై చర్చించనున్నారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అయింది. దానికి కౌంటర్‌కు ప్రతిపక్ష బీఆర్‌ఎస్ సిద్ధమైంది. గత సమావేశంలో విమర్శలు-ప్రతివిమర్శలతో సభ హీటెక్కనుంది. దీంతో ఇవాళ మళ్లీ అదీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉండనుంది.
Read also: Warangal Corona: కరోనా కొత్త వేరియంట్.. వరంగల్ ఎంజీఎంలో స్పెషల్ వార్డు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీ వెళ్ళిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నేతలు మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ కలిశారు. తాజా రాజకీయ పరిస్థితులు, నామినేటెడ్ పదవుల భర్తీ, లోక్ సభ ఎన్నికలు తదితర అంశాలపై వారితో చర్చించారు.అనంతరం గత నాలుగున్నరేళ్లుగా పార్లమెంట్ లో తనతో కలిసి పనిచేసిన వివిధ పార్టీల ఎంపీలకు రేవంత్ విందు ఇచ్చారు. ఎంపీ పదవికి రాజీనామా చేసి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిన్న రాత్రి ఈ విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో టీడీపీ, వైఎస్సార్సీపీ సహా పలు పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా దేశ రాజధాని ఢిల్లీలో నూతన తెలంగాణ భవన్ నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్, ఆంధ్రప్రదేశ్ భవన్ మధ్య ఉమ్మడి ఆస్తుల విభజనపై ముఖ్యమంత్రి దృష్టి సారించారు. ఈ అంశంపై తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ మంగళవారం భవన్ ఓఎస్డీ సంజయ్ జాజుతో కలిసి ఆయన నివాసంలో సమీక్ష నిర్వహించారు. భవనం యొక్క మొత్తం వైశాల్యం ఎంత? భవనాల వివరాలు, వాటి పరిస్థితి, అందులో తెలంగాణ వాటా తదితర వివరాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.
Pre Planned Bank Robbery: పక్కా ప్లాన్ ప్రకారమే.. ఐడీబీఐ బ్యాంకులో 46 లక్షల రూపాయలు చోరీ