NTV Telugu Site icon

CM Revanth Reddy : తెలంగాణకు మణిహారంగా 360 కి.మీ రీజనల్‌ రింగ్‌రోడ్డు

Cm Revanth

Cm Revanth

CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైదరాబాద్ నగరంలో అభివృద్ధి అంశంపై కాంగ్రెస్ హయాంలో జరిగిన పనులనే ప్రస్తావిస్తూ, గత ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నగరంలో ట్యాంక్ బండ్, శిల్పారామం, హైటెక్ సిటీ వంటి ప్రాంతాలలో జరిగిన అభివృద్ధి పట్ల పలు విమర్శలు వ్యక్తం చేస్తూ, సిటీలో కనీస డ్రైనేజీ వ్యవస్థ కూడా పూరణ చేయలేకపోయారని ఎద్దేవా చేశారు.

HYDRA : ఫిర్యాదు వచ్చింది.. ఫీల్డ్‌లోకి దిగి రఫ్పాడించిన హైడ్రా

కేసీఆర్ చరిత్రను విమర్శిస్తూ, ట్యాంక్ బండ్ నీటిని “కొబ్బరి నీళ్లుగా మార్చడమో” అన్న కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వానికి సంబంధించిన వెధవ పనులు, , ఫామ్ హౌసులలో కొమ్మోలు పడిన వారికి సంబంధించి మాట్లాడటం కూడా “దండగ” అని రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి, గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, తమ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందిందని చెప్పారు. అలాగే, నగరంలో ఆక్రమణలు నివారించేందుకు హైడ్రా (HYDRA) రంగప్రవేశం చేస్తున్నట్లు తెలిపారు. బీజేపీ నేత కిషన్ రెడ్డి మీద కూడా విమర్శలు గుప్పిస్తూ, ఆయన నాలుగు సంవత్సరాలుగా కేంద్ర మంత్రి అయినప్పటికీ తెలంగాణకు ఎలాంటి అభివృద్ధి నిధులు తీసుకురాలేదని ప్రశ్నించారు. ప్రజలకు కిషన్ రెడ్డి సమాధానాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే ఆలోచనలో ఉన్నామని, న్యూయార్క్, టోక్యో, సింగపూర్ వంటి నగరాలతో సమానంగా పర్యావరణ పరిరక్షణతో అభివృద్ధి చేయాలని చెప్పారు. భవిష్యత్ తరాల కోసం ఉత్తమమైన నగరాన్ని నిర్మించడానికి 15 వేల ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ , రైతుల సహకారంతో మరింత భూమిని సమీకరించి, హైదరాబాద్‌ను ప్రపంచంలో అగ్రశ్రేణి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతిబద్ధత వ్యక్తం చేశారు. తెలంగాణకు మణిహారంగా 360 కి.మీ రీజనల్‌ రింగ్‌రోడ్డు నిర్మిస్తున్నామన్నారు.

CM Chandrababu: కేబినెట్‌ తర్వాత మంత్రులతో విడిగా సీఎం భేటీ.. ఎప్పుడూ చూడలేదు.. ఇదో కొత్త ట్రెండ్..!

Show comments