NTV Telugu Site icon

CM Revanth Reddy : బీఆర్‌ఎస్‌, బీజేపీలకు సీఎం రేవంత్‌ రెడ్డి సవాల్‌

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy : తెలంగాణ శాసనసభలో కులగణన సర్వేపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న దానిపై స్పష్టమైన ప్రకటన చేస్తూ, రాజ్యాంగ పరంగా అది సాధ్యమయ్యేలా మార్పులు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. అయితే, ప్రస్తుతం రాజ్యాంగ సవరణకు అవకాశం లేకపోతే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన స్థాయిలో బీసీలకు 42 శాతం సీట్లు కేటాయిస్తుందని హామీ ఇచ్చారు.

Talasani Srinivas Yadav : బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు..

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “ఈ సభలోనే నేను మా పార్టీ తరఫున బీసీలకు 42 శాతం సీట్లు ఇస్తామని స్పష్టంగా ప్రకటిస్తున్నాను. రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలను ప్రాతినిధ్యం కల్పించడానికి కట్టుబడి ఉంది. బీఆర్ఎస్, బీజేపీ కూడా బీసీలకు 42 శాతం సీట్లు కేటాయించేందుకు సిద్ధమా? ఈ అసెంబ్లీ వేదికపై స్పష్టమైన ప్రకటన చేయాలని వారిని సవాల్ చేస్తున్నాను.” అని వ్యాఖ్యానించారు.

బీసీలకు న్యాయం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని స్పష్టం చేశారు సీఎం రేవంత్‌ రెడ్డి. “రాజ్యాంగ మార్పులు అవసరమైతే, మనం దానికై కృషి చేస్తాం. కానీ అప్పటివరకు, రాజకీయంగా, నైతికంగా కట్టుబడి కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం సీట్లు కేటాయించబోతోంది. ఇది మా కమిట్మెంట్.” అని అన్నారు.

శాసనసభ సమావేశాల్లో కులగణన సర్వేపై జరిగిన చర్చలో, ముఖ్యమంత్రి చేసిన ఈ ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీసీ వర్గాల హక్కులపై రాబోయే రోజుల్లో రాజకీయ పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Rahul Gandhi: రాహుల్ గాంధీపై “సభా హక్కుల తీర్మానం” ప్రవేశపెట్టనున్న బీజేపీ..