CM Revanth Reddy : తెలంగాణ శాసనసభలో కులగణన సర్వేపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న దానిపై స్పష్టమైన ప్రకటన చేస్తూ, రాజ్యాంగ పరంగా అది సాధ్యమయ్యేలా మార్పులు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. అయితే, ప్రస్తుతం రాజ్యాంగ సవరణకు అవకాశం లేకపోతే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన స్థాయిలో బీసీలకు 42 శాతం సీట్లు కేటాయిస్తుందని…