భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 132 జయంతి సందర్భంగా ఆయన 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. అంబేద్కర్ విశ్వ మానవుడు. ఆయన ఆలోచన విశ్వజనీయైనదన్నారు. ఆయన రచించిన రాజ్యాంగం సంవత్సరాలు దాటి పోతుందని, జయంతులు జరుపుకుంటూ పోవడంమేనా… కార్యాచరణ ఉందా? ప్రశ్నించుకోవాలన్నారు సీఎం కేసీఆర్. అంతేకాకుండా.. ‘విశ్వ మానవుని విశ్వరూపాన్ని ఇక్కడ ప్రతిష్టించుకున్నాం. అంబేద్కర్ ను చూస్తూ అధికారుల మనస్సులు ప్రభావితం కావాలి. అంబేద్కర్ విగ్రహం కాదు విప్లవం… తెలంగాణ కళల సాకారం చేసిన చైతన్య దీపికా. అంబేద్కర్ పేరు మీద శాశ్వత అవార్డు ఇవ్వాలని కత్తి పద్మారావు పత్రికా ముఖంగా సూచించారు. 51 కోట్లు దీని కోసం కేటాయిస్తున్నా.. అంబేద్కర్ జయంతి రోజు అవార్డులు ఇస్తాం.
Also Read : OFF The Record: విశాఖ చుట్టూ రాజకీయ చదరంగం
పరిస్థితి మారాలి… పార్టీలు గెలవడం, ఓడటం కాదు… ప్రజలు గెలవాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు వేరే పార్టీ అధికారంలో ఉంది. దళితుల అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన ఖర్చు ఒక లక్ష 20 వేల కోట్లు పై మాటే.. ఈనెల 30న సెక్రటేరియట్ ను ప్రారభించు కోబోతున్నాం. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో విజయం మనదే. రాజ్యం మనదే. మహారాష్ట్రలో బీఆర్ఎస్ కు ఊహించని స్పందన వస్తోంది. భవిష్యత్ లో దేశంలో 25 లక్షల కుటుంబాలకు దళిత బంధు అందజేస్తాం. అంబేద్కర్ కలలు సాకారం చేస్తాం. రాష్ట్రంలో ఈ సంవత్సరం లక్షా పాతిక వేల మందికి దళిత బంధు అందిస్తాం. నా జన్మ ధన్యం అయ్యింది. భారత దేశాన్ని సరైన మార్గంలో పెట్టడానికి అంబేద్కర్ సూచనలు పని చేస్తాయి.’ అని సీఎం కేసీఆర్ అన్నారు.
Also Read : GST Rule Change: వచ్చే నెలనుంచి మారనన్న జీఎస్టీ రూల్.. వ్యాపారులకు తిప్పలే