నేడు ఖమ్మంలో బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ సభలో ముగ్గురు సీఎంలు పినరయి విజయన్,కేజ్రీవాల్, భగవంతు మాన్ లతో పాటు మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా పాల్గొననున్నారు. అయితే.. ఇప్పటికే వీరు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో కాసేపట్లో ప్రగతి భవన్‌లో సీఎంలు కేరళ సీఎం పినరయి విజయన్,కేజ్రీవాల్, భగవంతు మాన్ లో సీఎం కేసీఆర్ బ్రేక్ ఫాస్ట్ చేయనున్నారు. వీరితో పాటు బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ లో సీపీఐ రాజా, అఖిలేష్ యాదవ్ పాల్గొననున్నారు. అయితే.. బ్రేకఫాస్ట్ చేస్తూనే జాతీయ రాజకీయ పరిస్థితుల చర్చించనున్నారు. అనంతరం 11.30 కి యాదగిరి గుట్టకి రెండు ప్రత్యేక హెలికాప్టర్‌లలో సీఎం కేసీఆర్ సహా నేతులు బయలుదేరనున్నారు.
Also Read : Ind vs NZ : నేడు ఉప్పల్ వేదికగా తలపడనున్న న్యూజిలాండ్-ఇండియా
ఈ సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దర్శించుకొని, ఆలయాన్ని సందర్శించనున్నారు. తరువాత అక్కడ నుండి నేరుగా ఖమ్మంలో జరిగే కంటి వెలుగు కార్యక్రమంలో నలుగురు సీఎం లు పాల్గొంటారు. ఖమ్మంలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమంను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా నేడు సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని ఆడిటోరియంలో సీఎం కేసిఆర్, ఇతర సీఎం లతో 6 గురు వ్యక్తులకు కళ్ళద్దాలను ఇస్తారు. రఘునాథపాలెం మండలం వి. వెంకటాయపాలెం గ్రామానికి చెందిన వెంపటి కమలమ్మ, అమరనేని వెంకటేశ్వర్లు, అనుబోతు రామనాథం, షేక్ గౌసియా బేగం, ధరావత్ పిచ్చమ్మ, కోలేం జ్యోతిలు కళ్ళాద్దాలను అందజేయనున్నారు.
Also Read : APSRTC: బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ.. ఏపీ నుంచి ప్రత్యేక బస్సులు