అమరావతిలో నేడు హౌసింగ్ శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వర్షాలు తగ్గిన తర్వాత డిసెంబరు నుంచి ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని అధికారులు వివరించారు. ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి నాణ్యతా లోపం లేకుండా చూడాలంటూ సీఎం ఆదేశించారు. స్టేజ్ కన్వెర్షన్ కూడా బాగా జరిగిందన్న అధికారులు.. ఇళ్లనిర్మాణాల్లో నాణ్యతను పరీక్షించేందుకు మొత్తంగా 36 ల్యాబులు ఏర్పాటు చేశామని వెల్లడించారు. సీఎం ఆదేశాల మేరకు పూర్తయిన ఇళ్లకు 15 రోజుల్లోగా విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నట్లు ట్రాన్స్‌కో అధికారులు వెల్లడించారు. కోర్టు కేసుల కారణంగా ప్రకాశం, అనంతపురం జిల్లాల్లోని 2 లే అవుట్లకు బదులుగా ప్రత్యామ్నాయ భూములను ఎంపిక చేశామని అధికారులు వెల్లడించారు. సుమారు 30 వేల మందికి ఇళ్ల నిర్మాణం కోర్టు కేసుల కారణంగా జాప్యం జరిగిందని అధికారులు తెలిపారు. వీరికి త్వరలోనే పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. దీనికోసం అసవరమైన భూ సేకరణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. సొంతిల్లనేది పేదవాడి కల, ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి లోపం ఉండకూడదు.
Also Read : Uddhav Thackeray: ప్రజాస్వామ్యం హత్యకు గురైంది.. పార్టీ, గుర్తును కోల్పోవడంపై ఉద్ధవ్
ఈ ల్యాబులను వినియోగించుకుని ఎప్పటికప్పుడు పరీక్షలను నిర్వహించాలి. పేదవాడికి అత్యంత నాణ్యమైన ఇంటిని అందించాలి. లే అవుట్లలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. నిర్వహణ విషయంలో గ్రామ, వార్డు సచివాలయాలు కీలక పాత్ర పోషించాలి. లే అవుట్లు పూర్తవుతున్న కొద్దీ మౌలిక సదుపాయాలను ప్రాధాన్యతా క్రమంలో ఏర్పాటు చేసుకుంటూ ముందుకు సాగాలి. ఇళ్ల నిర్మాణ కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి నెలాఖరు వరకూ చేసిన ఖర్చు రూ.7630 కోట్లు. ఈ ప్రభత్వం ఇప్పటి.వరకూ మొత్తంగా రూ.13,780 కోట్లు కేవలం ఇళ్ల నిర్మాణం కోసమే ఖర్చు చేసింది. ఇప్పటివరకూ సుమారుగా 2.75 లక్షల ఇళ్లను పూర్తి చేశాం. మరో మరో 74వేల ఇళ్లలో శ్లాబు వేసే పనులు జరుగుతున్నాయి. మరో 79 వేల ఇళ్లు రూఫ్ లెవల్లో ఉన్నాయి. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు ఈ ప్రభుత్వం గణనీయంగా సహాయం అందించింది. టిడ్కో ఇళ్ల కోసం గత ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన ఖర్చు రూ.8015 కోట్లు అయితే ఈ ప్రభుత్వం చేసిన ఖర్చు, పేదలకు కల్పించిన ప్రయోజనాలు విలువ చూస్తే మొత్తంగా రూ. 20,745 కోట్లు.’ అని వ్యాఖ్యానించారు.
Also Read : USA: భారత్, రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొంటే మాకేం ఇబ్బంది లేదు..