ఏపీలో చేనేత నేస్తం పథకం లబ్దిదారుల ఖాతాల్లో సీఎం జగన్ డబ్బులు జమ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలంటే బ్యాక్‌వర్డ్ క్లాసులు కాదు.. బ్యాక్‌బోన్ క్లాసులు అని ఆనాడే చెప్పానని, రూ.194.కోట్లను ఐదో విడత అందిస్తున్నామని, గతంలో నేతన్నలు చాలా ఇబ్బంది పడ్డారని, ఆత్మహత్యలు చేసుకున్నా కనీస సహాయం చేయలేదన్నారు. ఆ 70 కుటుంబాలను ఆర్థికంగా మేము అడ్డుకున్నామన్నారు. చేనేతలు ఇబ్బంది పడకుండా నవరత్నాలలో నేతన్న నేస్తం తీసుకు వచ్చామని, 2014 లో 650 హామీలను చంద్రబాబు ఇచ్చారని ఆయన మండిపడ్డారు.
Also Read : Warangal: కన్నీటి సంద్రంలో రైతన్న.. చెత్తకుప్పకు చేరిన లక్షలు విలువ చేసే టమాటా..!
మేనిఫెస్టో ఎక్కడ చూస్తారో నని..దానిని కనపడకుండా చేసాడని, నేతన్నలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. ‘ఏడాదికి వేయి కోట్లు ఖర్చు పెడతామని చెప్పి చేనేతలను మోసం చేశారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేతల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ. ..మహిళలతో పాటు ఇతరులకు 2 లక్షల 25 వేల కోట్లు ఆర్థిక సాయం చేశాం. చేనేతల కోసం నా పుట్టిన రోజున నేతన్న నేస్తం ప్రారంభించాం. ఏటా వరుసగా సాయం అందిస్తున్నాం. ఇప్పటి వరకూ 3 వేల 706.కోట్లకు పైగా వెచ్చించాం. చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్ చేపట్టాం. ఆన్ లైన్ ద్వారా కూడా విక్రయించే సదుపాయం కల్పించాం. అన్ని రకాలుగా సాయం చేస్తున్నాం. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అధికంగా సాయం అందిస్తున్నాం’ అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.
Also Read : Cockroach: మహిళ జీవితాన్ని నాశనం చేసిన బొద్దింక.. ఇల్లు, ఉద్యోగం వదిలి పరార్