వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంపై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్.జగన్ సమీక్ష నిర్వహించారు. రెవిన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, గనులశాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు. జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం అత్యంత ప్రాధాన్యత అని స్పష్టంచేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతపెద్ద స్థాయిలో సర్వే చేపట్టడంలేదన్నారు సీఎం. ప్రజలకు అత్యంత ఉపయోగకరమైన కార్యక్రమమని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎవరూ టాంపర్ చేయలేని విధంగా పత్రాలు అందిస్తున్నామని, ఇది ఇప్పటివారికే కాకుండా భవిష్యత్తు తరాలవారికీ కూడా చాలా ఉపయోగమని తెలిపారు సీఎం.
నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు సర్వే ప్రక్రియను పూర్తిచేసేదిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని, జాప్యానికి తావులేకుండా కావాల్సిన సాంకేతిక పరికరాలను తెప్పించుకోవాలని ఆదేశించారు సీఎం జగన్. రెవిన్యూశాఖ పరిధిలో తొలి దశలో చేపట్టిన 2వేల గ్రామాల్లో సర్వే ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఎం. ఇప్పటికే చాలావరకు పత్రాల పంపిణీ జరుగుతోందన్నారు అధికారులు. మే 20 నాటికి సర్వే రాళ్లు వేసే పనితోపాటు అన్ని రకాలుగా సర్వే ప్రక్రియ పూర్తిచేయాలన్నారు సీఎం. అవసరమైనంతమేర రోవర్లను ఆర్డర్ చేయాలన్నారు సీఎం. దీనివల్ల అనుకున్న సమయానికే సర్వే ప్రక్రియ పూర్తవుతుందన్నారు సీఎం.
Read Also:Mosquito Coil : ఆరుగురిని బలి తీసుకున్న మస్కిటో కాయిల్
అలాగే ప్రతి గ్రామ సచివాలయంలో సర్వేకోసం పరికరాలు ఉండాలన్న సీఎం. రోవర్ తరహా… పరికరాలు తప్పకుండా ఉండేలా చూసుకోవాలన్న సీఎం. దీనివల్ల సర్వేయర్ పూర్తిస్ధాయిలో తన పనిని పూర్తిచేసుకునే అవకాశం ఉంటుందన్న సీఎం. అందుబాటులో ఉన్న సాంకేతిక పరికరాలపై ఆలోచనలు చేయాలన్న సీఎం. సర్వే పూర్తైన తర్వాత సరిహద్దులు వద్ద వేసేందుకు 31 లక్షల సర్వే రాళ్లను సిద్ధంచేశామని తెలిపిన అధికారులు. రోజుకు 50వేల సర్వే రాళ్ల చొప్పున సరఫరాచేసేందుకు ప్రణాళిక వేసుకున్నామన్న అధికారులు.
తర్వాత దశల్లో జరిగే సర్వే ప్రక్రియ కోసం రాళ్ల కొరత రాకుండా ముందస్తుగానే సన్నాహాలు చేసుకోవాలన్నారు సీఎం. మున్సిపల్ ప్రాంతాల్లో చేయాల్సిన సర్వేకోసం సన్నాహాలు చేసుకుంటున్నామన్నారు మున్సిపల్ శాఖ అధికారులు. దీనికి సంబంధించి డేటా క్రోడీకరణ జరుగుతుందన్న అధికారులు. నిర్దేశించుకున్న టైం లైన్స్ ప్రకారం కచ్చితంగా సర్వే ప్రాంతాల్లో పూర్తిచేయాలన్నారు సీఎం. ఏప్రిల్ మూడో వారం నాటికి ౩౦౦ గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తవుతుందన్నారు పంచాయతీరాజ్ అధికారులు. డిసెంబరులోగా మొత్తం అన్ని గ్రామాల్లో ఈ సర్వే పూర్తిచేసేదిశగా లక్ష్యాలను పెట్టుకున్నామన్నారు అధికారులు.
Read Also: Congress: విదేశాల జోక్యంతో తత్వం బోధపడింది… రాహుల్ విషయంలో కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలు