Mosquito Coil : దేశ రాజధాని ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. రాత్రి వేళ దోమలను అరికట్టేందుకు కుటుంబసభ్యులు మస్కిటో కాయిల్ వెలిగించారు. అయితే ఆ రాత్రే ఆ కుటుంబానికి చివరిదని గుర్తించలేకపోయారు. రాత్రి కుటుంబసభ్యులు నిద్రిస్తున్న సమయంలో మెట్రెస్‌పై కాయిల్ పడి మంటలు చెలరేగాయి. ఈ మంటల కారణంగా ఇల్లంతా పొగలు వ్యాపించాయి. ఈ అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు పొగ పీల్చడంతో మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన ఢిల్లీలోని శాస్త్రి పార్క్ ప్రాంతంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Read Also: Radhika Apte: 14 ఏళ్ల తర్వాత స్పెషల్ ఆఫీసర్ అవతారం ఎత్తిన సాధారణ హౌజ్ వైఫ్
ఢిల్లీలోని శాస్త్రినగర్ ప్రాంతంలోని మాచి మార్కెట్‌లో రాత్రి భోజనం చేసిన తర్వాత ఒక కుటుంబం యథావిధిగా నిద్రపోయింది. ఆ ప్రాంతంలో దోమల బెడద ఎక్కువగా ఉండడంతో రాత్రి వేళల్లో దోమల నివారణకు మస్కిటో కాయిల్స్ వెలిగించారు. అయితే అర్థరాత్రి కుటుంబసభ్యుల పరుపుపై కాయిల్ పడి మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లో విషవాయువు వ్యాపించి ముందుగా అందరూ స్పృహతప్పి పడిపోయారు. దీంతో ఊపిరాడక ఇంట్లోని ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో నలుగురు పురుషులు, ఒక మహిళ, ఒకటిన్నర నెల పాప ఉంది. మంటల్లో మరో ఇద్దరు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 22 ఏళ్ల వ్యక్తి మొదటి చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయ్యాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Read Also:Vikarabad school: ప్రభుత్వ పాఠశాలలో దారుణం.. విద్యార్థులతో బండరాళ్లను మోయిస్తున్న టీచర్లు