ఏపీ సీఎం జగన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో నేడు ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు పార్లమెంట్ కార్యాలయంలో ప్రధానితో సీఎం జగన్ భేటీ కానున్నారు. పోలవరం ప్రాజెక్ట్, విభజన హామీలు రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించే అవకాశం ఉంది. ఆ తర్వాత హోంశాఖ మంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులతోనూ సీఎం జగన్ భేటీ కానున్నట్లు సమాచారం.
Also Read :H3N2 Influenza: మధ్యప్రదేశ్‌లో మొదటి ఇన్ ఫ్లూయెంజా H3N2 కేసు.. యంత్రాంగం అప్రమత్తం
రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాలపై ప్రధాని మోడీతో జగన్ చర్చించనున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ హుటాహుటిన సీఎం జగన్ హస్తినకు చేరుకోవడం, ప్రధాని మోడీతో భేటీ కానుండటంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై జగన్ ప్రధానితో చర్చించనున్నారని తెలుస్తోంది. అయితే.. సీఎం జగన్ గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి సాయంత్రం 5.07 గంటలకు ఆయన ఢిల్లీకి బయలుదేరారు. రాత్రి 7.30 గంటల సమయంలో ఢిల్లీ ఎయిర్పోర్టుకు, అక్కడి నుంచి తను బసచేస్తున్న వన్ జన్‌పథ్‌కి చేరుకున్నారు.
Also Read : Double-Decker Bus: డబుల్ డెక్కర్ బస్సులో ప్రయాణం.. 50 ఏళ్ల తర్వాత కలిసిన స్నేహితులు