Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • TSPSC Paper Leakage
  • Delhi Liquor Scam
  • Earthquake
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Andhra Pradesh News Cm Jagan Meeting With Pm Modi 2

CM Jagan : ప్రధాని మోడీ సీఎం జగన్‌ భేటీ.. చర్చించిన అంశాలు ఇవే

Published Date :March 17, 2023 , 2:31 pm
By Gogikar Sai Krishna
CM Jagan : ప్రధాని మోడీ సీఎం జగన్‌ భేటీ.. చర్చించిన అంశాలు ఇవే
  • Follow Us :

ప్రధాని నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నేడు ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ రోజు ఉదయం పార్లమెంటులోని ప్రధానమంత్రి కార్యాలయంలో మోడీని సీఎం జగన్‌ కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించారు సీఎం జగన్‌. ఈ మేరకు విజ్ఞాపన పత్రాన్ని మోడీకి సీఎం జగన్‌ అందించారు.

ప్రధానితో సీఎం ప్రస్తావించిన అంశాలు :

1. రాష్ట్ర విభజన జరిగి 9 సంవత్సరాలు కావొస్తోంది. ఇప్పటివరకూ రాష్ట్రానికి నెరవేర్చాల్సిన అనేక అంశాలు ఇంకా పెండింగులోనే ఉన్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన చాలా ద్వైపాక్షిక అంశాలు పరిష్కారానికి నోచుకోలేదు. వీటిపై వెంటనే దృష్టిసారించమని కోరుతున్నాను.

2. గతంలో నేను ప్రస్తావించిన ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలపై కేంద్రం ఆర్థికశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపి కొంత పురోగతి సాధించింది. కీలక అంశాలన్నీ ఇంకా పెండింగులోనే ఉన్నాయన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను.

3. 2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిసోర్స్‌ గ్యాప్‌ ఫండింగ్‌ కింద రూ.36,625 కోట్ల రూపాయలు పెండింగులో ఉన్నాయి. రీసోర్స్‌ గ్యాప్‌ ఫండింగ్‌ చేస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రం ప్రభుత్వం చెప్పింది. ఈ నిధులను వెంటనే విడుదలచేయాల్సిందిగా, సంబంధిత శాఖలకు తగిన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.

4. గతంలో ఉన్న ప్రభుత్వం పరిమితికి మించి రుణాలు వాడిందన్న కారణంతో ఇప్పుడు రాష్ట్ర రుణాల పరిమితులపై ఆంక్షలు విధించారు. ఈ ప్రభుత్వం తప్పు లేకపోయినప్పటికీ నిబంధనలు ప్రకారం ఇచ్చిన రుణ పరిమితిని కూడా తగ్గించారు. 2021–22లో రూ.42,472 కోట్ల రుణపరిమితి కల్పించి, తదుపరి కాలంలో రూ.17,923 కోట్లు తగ్గించారు. కోవిడ్‌ మహమ్మారి సృష్టించిన ఆర్థిక విపత్తు సమయంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో జోక్యంచేసుకుని సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.

5. పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సంకల్పంతో ముందుకు సాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చేదిశగా ప్రాజెక్టు నిర్మాణాన్ని సాగిస్తోంది. ఈ ప్రాజెక్టు విషయలో కేంద్రం ప్రభుత్వం తగిన సహకారం అందిస్తే కొద్దికాలంలోనే ఇది వాస్తవరూపంలోకి వస్తుంది. ఫలితాలు ప్రజలకు అందుతాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తాను సొంతంగా సొంత ఖజానానుంచి రూ.2600.74 కోట్ల రూపాయలు ఖర్చుచేసింది. గడచిన రెండు సంవత్సరాలుగా ఇవి పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బకాయిలను వెంటనే చెల్లించాల్సిందిగా తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాను.

6. పోలవరం ప్రాజెక్టు అంచనాలను టెక్నికల్‌ అడ్వయిజరీ కమిటీ రూ. 55,548 కోట్లుగా నిర్థారించింది. వెంటనే దీనికి ఆమోదం తెలపాల్సిందిగా కోరుతున్నారు.

7. తాగునీటి సరఫరా అంశాన్నికూడా పోలవరం ప్రాజెక్టులో భాగంగా చూడాలని, ప్రాజెక్టు నిర్మాణంలో కాంపొనెంట్‌ వారీగా నిబంధనలను సడలించాలని విజ్ఞప్తిచేస్తున్నాను.

8. పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులకు వీలైనంత త్వరగా పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తిచేస్తున్నాను. ఆలస్యం అవుతున్న కొద్దీ ప్రాజెక్టు వ్యయం పెరిగిపోతుందనే విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను. డీబీటీ పద్ధతిలో ముంపు బాధితులకు ఈ సహాయం అందిస్తే జాప్యాన్ని నివారించవచ్చు.

9. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అడహాక్‌గా రూ.10వేల కోట్లు మంజూరుచేయాలని కోరుతున్నాను.

10. తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్కోకు రావాల్సిన బకాయిలు అలానే ఉన్నాయి. 2014 జూన్‌ నుంచి 2017 జూన్‌ వరకూ సరఫరాచేసిన విద్యుత్తుకు సంబంధించి రూ.7,058 కోట్లు రావాల్సి ఉంది. వీటిని వెంటనే ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను.

11. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో హేతు బద్ధత పాటించకపోవడం వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోంది. దీనివల్ల పీఎంజీకేఏవై కార్యక్రమం కిందకు రాని, 56లక్షల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా రేషన్‌ ఇస్తోంది. దాదాపు రూ.5,527 కోట్ల భారాన్ని మోయాల్సి వస్తోంది. ఈ విషయంలోఆంధ్రప్రదేశ్‌ చేసిన విజ్ఞప్తి సరైనదేనని నీతి ఆయోగ్‌ కూడా నిర్ణయించిన నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం వినియోగించని రేషన్‌ కోటాను రాష్ట్రానికి కేటాయించాల్సిందిగా కోరుతున్నాను.

12. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చింది. దీనివల్ల రాష్ట్రానికి గ్రాంట్లు, పన్ను రాయితీలు లభిస్తాయి. ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. పెద్ద ఎత్తన పరిశ్రమలు రావడమేకాకుండా, సేవారంగం విస్తరిస్తుంది. స్వయం శక్తి దిశగా రాష్ట్రం అడుగులేసేందుకు తోడ్పడుతుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తిచేస్తున్నాను.

13. రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేశాం. ప్రతిజిల్లాకు సుమారుగా 18లక్షలమంది జనాభా ఉన్నారు. కొత్తగా కేంద్రం మంజూరుచేసిన మూడు మెడికల్‌ కాలేజీలతో కలిపి మొత్తంగా 14 మాత్రమే ఉన్నాయి. మిగిలిన 12 కాలేజీలకు వీలైనంత త్వరగా అనుమతులు మంజూరుచేయాలని కోరుతున్నాను. ఈ కాలేజీలకు సంబంధించిన పనులు అత్యంత వేగంగా ముందుకు సాగుతున్నాయి. వీటికి సంబంధించి కేంద్రం తగిన విధంగా సహాయపడాలని విజ్ఞప్తిచేస్తున్నాను.

14. వైయస్సార్‌ కడప జిల్లాలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని ఏపీ పునర్విభజనచట్టంలో కేంద్రం హామీ ఇచ్చింది. ఈ ప్లాంట్‌ నిలదొక్కుకోవాలంటే ఖనిజ కొరత లేకుండా ఏపీ ఎండీసీకి గనులు కేటాయించాలని విజ్ఞప్తిచేస్తున్నాను.

  • Tags
  • breaking news
  • cm jagan
  • latest news
  • PM Modi
  • telugu news

WEB STORIES

Onscreen Moms: రీల్ అమ్మలు.. రియల్ పేర్లు

"Onscreen Moms: రీల్ అమ్మలు.. రియల్ పేర్లు"

ఈ లక్షణాలు ఉన్నాయా..? అయితే మీరు మానసిక ఒత్తడికి గురవుతున్నట్లే..

"ఈ లక్షణాలు ఉన్నాయా..? అయితే మీరు మానసిక ఒత్తడికి గురవుతున్నట్లే.."

Buttermilk Benefits: మజ్జిగ తాగండి.. ఈ లాభాలు పొందండి

"Buttermilk Benefits: మజ్జిగ తాగండి.. ఈ లాభాలు పొందండి"

Historical Forts: భారతదేశంలో ప్రసిద్ధి చెందిన 10 చారిత్రక కోటలు

"Historical Forts: భారతదేశంలో ప్రసిద్ధి చెందిన 10 చారిత్రక కోటలు"

Meal Maker: మీల్ మేకర్‌తో బోలెడు ప్రయోజనాలు.. అస్సలు విడిచిపెట్టొద్దు

"Meal Maker: మీల్ మేకర్‌తో బోలెడు ప్రయోజనాలు.. అస్సలు విడిచిపెట్టొద్దు"

మనం రోజు వినే జీపీఎస్ గొంతు ఈ అమ్మాయిదే..

"మనం రోజు వినే జీపీఎస్ గొంతు ఈ అమ్మాయిదే.."

Women's Health: గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఈ చిట్కాలు పాటించండి..

"Women's Health: గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఈ చిట్కాలు పాటించండి.."

Haunted Places: ప్రపంచంలోని టాప్-10 హాంటెడ్ ప్రదేశాలు

"Haunted Places: ప్రపంచంలోని టాప్-10 హాంటెడ్ ప్రదేశాలు"

Spinach Juice: పాలకూర జ్యూస్ తాగితే.. ఈ సమస్యలన్నీ మటాష్

"Spinach Juice: పాలకూర జ్యూస్ తాగితే.. ఈ సమస్యలన్నీ మటాష్"

Beautiful Cities: ప్రపంచంలోని 10 అత్యంత అందమైన నగరాలు

"Beautiful Cities: ప్రపంచంలోని 10 అత్యంత అందమైన నగరాలు"

RELATED ARTICLES

CM Jagan Mohan Reddy: కొత్త పాలిటెక్నిక్ కాలేజీలకు గ్రీన్ సిగ్నల్

Minister Venugopal: టీడీపీ సభ్యుల తీరు గర్హనీయంగా ఉంది

Atchannaidu: ఎమ్మెల్సీ ఫలితాలతో ఏపీ రాజకీయం మారింది

MLC Chiranjeevi Rao: పట్టభద్రులంతా అసంతృప్తితో ఉన్నారు

MLC Kancharla Srikanth: చంద్రబాబుని సీఎంని చేయడం కోసం పనిచేస్తా

తాజావార్తలు

  • Kantharao : దాసరిని కాంతారావు ఎందుకు కొట్టారు!?

  • Shobhan Babu: యన్టీఆర్ ను ఫాలో కాలేక పోయిన శోభన్ బాబు!

  • Hansika Motwani: పెళ్ళైనా ఇంకా అందాల ఆరబోత చేస్తున్నావ్ .. ‘దేశముదురు’వే

  • Sonakshi Sinha: నిమ్మపండు రంగు డ్రెస్ లో స్టార్ డాటర్ వయ్యారాలు పోతుందిగా

  • Neha Shetty: మనసులను విరకొట్టే మెషిన్ వి రాధిక నువ్వు

ట్రెండింగ్‌

  • Rohit Sharma : బామ్మర్ది పెళ్లిలో రోహిత్ శర్మ రచ్చ

  • Naatu Naatu Song: పెళ్లిలో షారూఖ్ దంపతులు ఏం చేశారంటే..

  • Razor Blades In Stomach: వ్యక్తి కడుపులో 56 రేజర్ బ్లేడ్‌లు!

  • Diabetes Symptoms: మధుమేహం లక్షణాలు ఇవే.. డయాబెటిస్ నియంత్రణ ఎలా?

  • Double-Decker Bus: డబుల్ డెక్కర్ బస్సులో ప్రయాణం.. 50 ఏళ్ల తర్వాత కలిసిన స్నేహితులు

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions