ఈరోజుల్లో జనాలు ఉరుకులు పరుగులు జీవితం గడుపుతున్నారు. తినేంత కూడా టైం లేకుండా గడుపుతున్నారు. వంట వండటంలో సులువైన పద్ధతులను వెతుక్కుంటున్నారు.. అందులో భాగంగానే వంటను ఫ్రెజర్ కుక్కరు లో వండుతున్నారు.. అయితే అన్ని ఆహారాలను ఇందులో వండకూడదని నిపుణులు చెబుతున్నారు.. మరి ఎటువంటి ఆహారాలను ఈ కుక్కర్ లో వండకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
కుక్కర్ లో వండడం వలన ఆహార పదార్ధాలు వాటి రుచిని కోల్పోతాయి. ముఖ్యంగా చాలా మంది అన్నాన్ని కుక్కర్ లోనే వండుతారు. అన్నాన్ని కుక్కర్ లో వండడం వలన బియ్యం లోని పిండిపదార్ధం అక్రిలమైడ్ అనే హానికరమైన రసాయాన్ని రిలీజ్ చేస్తుంది. ఇది శరీరంలోని అనేక అనారోగ్యాలకు కారణం అవుతుంది. వీలైనంత వరకు అన్నం కుక్కర్లో వండకుండా విడిగా వండడం మంచిది.. టైం సేవ్ చేయవచ్చు అన్న ఉద్దేశ్యంతో ఆడవారు ఎక్కువగా వంటలను అందులోనే చేస్తుంటారు.
అలాగే బంగాళాదుంపలు, పాస్తా కూడా కుక్కర్లో ఉడికించకూడదు. బంగాళా దుంపలో కూడా పిండిపదార్ధాలు ఉంటాయి. పాస్తాలో ఉండే అధిక సాచురేటెడ్ కంటెంట్ హానికరమైన రసాయనాలను విడుదల చేస్తుంది. పాలు, జున్ను లాంటివి కుక్కర్లో వండడం వలన అవి విరిగిపోతాయి. ఇలాంటి వాటిని తినడం వలన మన ఆరోగ్యం కూడా పాడవుతుంది. ఇక చేపలు కూడా ప్రెజర్ కుక్కర్ లో వండడం మంచిది కాదు. అలా వండితే, వాటిల్లో ఉన్న ఫైబర్ కంటెంట్ పూర్తిగా పోతుంది. అలాంటి ఆహరం తినడం వలన అనారోగ్యం తప్ప ఏమీ మిగలదు..
మీరు క్రీమీ బేస్ ఉన్న కూరలను వండడానికి ప్రెషర్ కుక్కర్‌ని ఉపయోగిస్తుంటే, మీ నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని మేము సూచిస్తున్నాము. ప్రెజర్ కుక్కర్‌లో వండినప్పుడు పాలు లేదా చీజ్ వంటి పాల ఉత్పత్తులు పెరుగుతాయి. మీరు మీ వంటకం గందరగోళంగా మారకుండా కాపాడుకోవాలనుకుంటే, వంట చివరిలో డైరీ మూలకాన్ని జోడించడం లేదా పూర్తిగా మరొక వంట పద్ధతికి మారడం ఉత్తమం.. ఏదైనా ఉడకపెట్టి తినడం మంచిది అని గుర్తుంచుకోండి..