Tesla: ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ కు చెందిన టెస్లా ఇండియా మోటార్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పూణేలోని విమాన్ నగర్‌లోని పంచశీల్ బిజినెస్ పార్క్‌లో కార్యాలయ స్థలాన్ని అద్దెకు తీసుకుంది. గత వారంలో టెస్లా ఎగ్జిక్యూటివ్‌ల ప్రతినిధి బృందం భారతదేశంలో తన ఎలక్ట్రిక్ కార్లను విక్రయించడానికి ప్రోత్సాహకాలు, ప్రయోజనాల గురించి చర్చించడానికి వాణిజ్య, పరిశ్రమల మంత్రిని కలిసింది. టెస్లా ఇప్పుడు భారత్‌లో తన తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు స్పష్టమైంది. టెస్లా ప్రభుత్వంతో ఏకీభవిస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also:Amaranth Health Benefits: షుగర్ పేషేంట్స్ తప్పనిసరిగా తినాల్సిన తృణధాన్యం ఇదే.. సూపర్బ్ రిసల్ట్!
టెస్లా భారతీయ అనుబంధ సంస్థ పంచశీల్ బిజినెస్ పార్క్‌లోని B వింగ్ మొదటి అంతస్తులో 5,580 చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ కోసం టేబుల్‌స్పేస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఐదేళ్ల లీజు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆఫీస్ స్పేస్ కోసం అద్దె అక్టోబర్ 1, 2023 నుండి ప్రారంభమవుతుంది. రెండు కంపెనీలు సంవత్సరానికి 5 శాతం ఎస్కలేషన్ నిబంధనతో 36 నెలల లాక్-ఇన్ పీరియడ్‌ను అంగీకరించాయి. EV తయారీదారు ఈ లీజును మరో 5 సంవత్సరాలకు పొడిగించే అవకాశం ఉంది.
Read Also:Telangana : ఇక్కడ ఫోటోలు దిగితే టమోటాలు ఫ్రీ.. ఫ్రీ..ఫొటోగ్రాఫర్ అదిరిపోయే ఆఫర్..
రియల్ ఎస్టేట్ అనలిటిక్స్ సంస్థ CRE మ్యాట్రిక్స్ షేర్ చేసిన పత్రాల ప్రకారం.. టెస్లా ఆఫీసు స్థలం కోసం నెలకు రూ. 11.65 లక్షల అద్దె చెల్లిస్తుందని హిందుస్థాన్ టైమ్స్ నివేదిక పేర్కొంది. దీంతోపాటు రూ.34.95 లక్షల సెక్యూరిటీ డబ్బులు కూడా ఇవ్వనున్నారు. పంచశీల్ బిజినెస్ పార్క్ ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. అభివృద్ధి పరిమాణం 10,77,181 చ.అ. ఇది పూణే అంతర్జాతీయ విమానాశ్రయం నుండి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. నగరంలోని నివాస ప్రాంతాలైన కోరేగావ్ పార్క్, ఖరాడి, వడ్గాంచేరి, కళ్యాణి నగర్ నుండి సులభంగా చేరుకోవచ్చు. టెస్లా తన భారతీయ అనుబంధ సంస్థను 2019లో బెంగళూరులో నమోదు చేసింది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు, EV బ్యాటరీలను తయారు చేయడానికి ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.