77వ సాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే నేడు ఏపీలోనూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో సీఎం జగన్ పతాకావిష్కరణ చేశారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు మెడల్స్ అందించారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులకు మెడల్స్ ప్రదానం సమయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. గ్రే హౌండ్స్ కు చెందిన గౌరు నాయుడుకు మెడల్ ప్రదానం చేశారు సీఎం జగన్.. అయితే.. ఆ తరువాత గౌరు నాయుడు సెల్యూట్ చేస్తుండగా బహుకరించిన మెడల్ కిందపడటంతో సీఎం జగన్ వెంటనే గుర్తించి కింద పడిన మెడల్ ను తీసి మళ్లీ పదానం చేశారు.
Also Read : Virat Kohli New House: 8 ఎకరాల్లో విరాట్ కోహ్లీ కొత్త ఇల్లు.. క్రికెట్ పిచ్ కూడా!
ఇదిలా ఉంటే.. త్రివర్ణ పతాకావిష్కరణ అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం నవరత్నాల పాలన అని సీఎం జగన్ పేర్కొన్నారు. 99.05శాతం హామీలను అమలు చేశామని తెలిపారు. 50 నెలల్లో డీబీటీ ద్వారా రూ. 2.31 లక్షల కోట్ల లబ్ధి చేరుకగా.. 2 లక్షల 6 వేల 638 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేసినట్లు పేర్కొన్నారు. విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నామని వైఎస్ జగన్ పేర్కొన్నారు. నాడు-నేడుతో 45 వేల ప్రభుత్వ బడుల రూపురేఖలు మారగా.. గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగీష్ మీడియం అమలు చేస్తున్నట్లు తెలిపారు.
Also Read : Pakistan Zindabad : పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు.. చితక్కొట్టిన జనం