Virat Kohli New House: 8 ఎకరాల్లో విరాట్ కోహ్లీ కొత్త ఇల్లు.. క్రికెట్ పిచ్ కూడా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anushka Sharma and Virat Kohli build a New House in Alibaug: స్టార్ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు కొత్త ఇంటిని నిర్మించుకుంటున్నారు. ఏకంగా 8 ఎకరాల్లో ఈ ఇంటి నిర్మాణం ఆరంభం అయింది. అవసరమైన అన్ని అనుమతులు పొందిన తరువాత మహారాష్ట్రలోని అలీబాగ్ ప్రాంతంలో ప్రశాంతమైన వాతావరణంలో, సువిశాల విస్తీర్ణంలో ఈ ఇల్లు నిర్మాణం జరుగుతోంది. ప్రస్తుతం విరుష్క కొత్త ఇల్లు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పనులను పర్యవేక్షించడానికి కోహ్లీ, అనుష్కలు గత ఆదివారం అలీబాగ్ ప్రాంతంకు వచ్చారు. ఇందుకు సంబందించిన వీడియోస్, ఫొటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంట తమ ఇంటిని అందంగా, అద్భుతంగా నిర్మించడం కోసం ఎటువంటి అవకాశాన్ని వదలడం లేదు. ఇటీవల ప్రముఖ ఆర్కిటెక్ట్ మజుందార్ బ్రావో ఇంటి పనుల పర్యవేక్షణ కోసం అలీబాగ్ వచ్చారు. రానున్న 18-24 నెలల్లో 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లు సిద్ధమవుతుందని సమాచారం. గతంలో విరాట్, అనుష్కలు ఈ భూమిని రూ. 19.24 కోట్లకు కొనుగోలు చేశారు. 2.54 ఎకరాలు, 4.91 ఎకరాల ఆస్తిని రెండు వేర్వేరు ఒప్పందాలలో కొనుగోలు చేశారు. రియల్ ఎస్టేట్ డెవలపర్ సమీరా హాబిటాట్స్ నుంచి ఈ భూమిని కొనుగోలు చేశారు.
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
Also Read: MS Dhoni Retirement: ఎంత పని చేసావ్ ధోనీ భాయ్.. భారత క్రికెట్ ఫాన్స్ ఎప్పటికీ మర్చిపోని రోజు!
విరాట్ కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ అలీబాగ్‌లోని జిరాద్ గ్రామంలో ఈ ఒప్పందాన్ని కుదిర్చాడు. మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో ఉన్న ఒక తీరప్రాంత పట్టణమే అలీబాగ్. అలీబాగ్ ఎంతో అందంగా, ప్రశాంతంగా ఉంటుంది. అందుకే భారీగా ఖర్చుపెట్టి ఇళ్లు నిర్మిస్తున్నాడు. క్రికెట్ పిచ్ కూడా రూపొందిస్తారని సమాచారం తెలుస్తోంది. అలానే కార్ గ్యారేజ్, స్విమ్మింగ్ పూల్, జిమ్, గార్డెన్ లాంటి ఎన్నో సదుపాయాలు ఇంటిలో ఉండనున్నాయి. కోహ్లీ ఆటలో ఎంత నాణ్యత ఉంటుందో.. లైఫ్‌లో కూడా అంతే రాయల్‌గా ఉండేలా చూసుకుంటాడు.
Virat Kohli and Anushka Sharma in Alibaug to begin construction of their new house on 8 acres of land. pic.twitter.com/5CVNtz5vcv
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 14, 2023
తాజావార్తలు
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!